Homeఎంటర్టైన్మెంట్Prashanth Neel: ప్రశాంత్ నీల్ కి కాల్ చేసి సినిమా చేద్దామని చెప్పిన స్టార్ హీరో...

Prashanth Neel: ప్రశాంత్ నీల్ కి కాల్ చేసి సినిమా చేద్దామని చెప్పిన స్టార్ హీరో…

Prashanth Neel: కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. కేజీఎఫ్, కేజిఎఫ్ 2, సలార్ సినిమాలతో ఒక్కసారిగా తను ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కూడా భారీ విజయాన్ని సాధిస్తాననే దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో భారీ […]

Prashanth Neel: కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. కేజీఎఫ్, కేజిఎఫ్ 2, సలార్ సినిమాలతో ఒక్కసారిగా తను ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కూడా భారీ విజయాన్ని సాధిస్తాననే దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికే అతనితో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.

అందులో భాగంగానే రామ్ చరణ్ సైతం రీసెంట్ గా ప్రశాంత్ నీల్ కి కాల్ చేసి ఒక అదిరిపోయే కథ ఉంటే చెప్పమని తప్పకుండా మనం సినిమా చేద్దామని వీలైనంత తొందరగా ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని కూడా చెప్పారట. ప్రశాంత్ నీల్ సైతం అద్భుతమైన కథను కూడా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే డ్రాగన్ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన సలార్ 2 సినిమాని కంప్లీట్ చేసి అప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. పెద్ది సినిమాతో పర్ఫామెన్స్ పరంగా వందకి వంద మార్కులు కొట్టేసిన ఆయన ఇప్పుడు సుకుమార్ తో చేయబోయే సినిమా విషయంలో కూడా అదే క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… తను అనుకున్నట్టుగానే ప్రశాంత్ నీల్ రాబోయే రోజుల్లో కూడా భారీ విజయాలను సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper