Naga Durga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలైతే వస్తున్నాయి. స్టార్ హీరోలు పాన్ ఇండియా బాట పడుతుంటే యంగ్ హీరోలు కొత్త దర్శకులు డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ రైటింగ్స్ టీమ్ లో నుంచి వచ్చే కథలు చాలా అద్భుతాలను సృష్టిస్తున్నాయనే విషయం మనందరికి తెలిసిందే. ఇక రీసెంట్ గా ‘ఇడుపు కాయితం’ అనే ఒక సినిమాని అనౌన్స్ చేశారు…ప్రియదర్శి హీరోగా ఫోక్ సాంగ్స్ కి తన డ్యాన్స్ తో ప్రాణం పోస్తున్న నాగ దుర్గ హీరోయిన్ గా వంశీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న బన్నీ వాసు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం… ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఇది గ్లోబల్ కథ అంటు ఆయన చెప్పాడు. అలాగే ఈ సినిమాను బీహార్ లో తీసుకెళ్లి రిలీజ్ చేసిన అక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఆయన చెప్పాడు. ఈ సినిమాని చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరు వాళ్ల నిజ జీవితాన్ని చూసుకుంటారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
ఇక ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి ని అనుకున్నప్పుడు హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు నాగ దుర్గ అయితే ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా న్యాయం జరుగుతుంది అని అనుకున్నాం. ఆమె ను ఈ సినిమాలో హీరోయిన్ గా చేయమని సంప్రదించినప్పుడు ఆమె నాకు 15 రూల్స్ పెట్టింది అంటూ బన్నీ వాసు చెప్పాడు.
నిజానికి తెలుగు అమ్మాయి తను సినిమాలు చెయ్యాలి అంటే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ పెట్టుకోవడం మంచిదే. ఆమె పెట్టిన రూల్స్ కూడా నాకు బాగా నచ్చాయి అంటూ బన్నీ వాసు చెప్పడం విశేషం. ఇక ఇదంతా చూసిన వాళ్ళు మాత్రం నాగ దుర్గ 15 రూల్స్ పెట్టడం వెనక కారణమేంటంటే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తారు కదా… అందుకే ఆమె ముందుగానే వాటన్నింటిని చూసుకొని అవి ఒకే అయితేనే సినిమా చేస్తానని కండిషన్స్ పెట్టుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు…
ఇక మొన్నటి దాకా యూట్యూబ్లో రచ్చ చేసిన నాగ దుర్గా ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మెరవబోతుంది. సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మొదటి నుంచి కూడా చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో తను హీరోయిన్ గా రాణిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…




