Ram Charan Peddi release date : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) పై ఇటు అభిమానుల్లో , అటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ కంటెంట్ డైనమైట్ లాగా పేలింది. ఇలాంటి సినిమా కోసం కదా , ఇన్ని రోజులు మేము ఆతృతగా ఎదురు చూసింది , ఈసారి రామ్ చరణ్ కొట్టే దెబ్బ కు పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయిపోతుంది, అవలీల గా 600 నుండి 1000 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అభిమానులు బలమైన నమ్మకం పెట్టుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమా కి క్రియేట్ అయిన పాజిటివ్ బజ్ ని చంపడమే లక్ష్యం గా పెట్టుకున్నారు. ఒక ప్లానింగ్ లేదు , పద్దతి లేదు.
ఎంత వర్క్ బ్యాలన్స్ ఉంది?, ఎప్పటికి ఆ వర్క్ పూర్తి అవుతుంది అనే అంచనా డైరెక్టర్ కి లేదు , మూవీ టీం కి కూడా లేదు. ముందుగా ఈ ఏడాది మార్చి 27 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అప్పటికి సినిమా 60 శాతం మాత్రమే పూర్తి అవ్వడం తో ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. మరో 16 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ఇప్పటి వరకు మూవీ నుండి ఎలాంటి సౌండ్ లేదు. సినిమా వాయిదా పడింది అనే విషయం అందరికీ అర్థం అయిపోయింది. కనీసం ఆ విషయాన్ని అయినా అభిమానులకు చెప్పి , కొత్త విడుదల తేదీని ప్రకటించాలి కదా , అది కూడా లేదు. ఇంకా ఈ సినిమాని జూన్ లో విడుదల చెయ్యాలా?, లేదా జులై లో విడుదల చెయ్యాలా?, ఇవి రెండు కాకుండా ఆగస్టు 13 న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారు అట.
సాధ్యమైనంత వరకు జూన్ 25 నే ఈ చిత్రాన్ని తీసుకొని రావాలని చూస్తున్నారు. కానీ అప్పటికి షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందా లేదా అని అనుమానంతో ఇప్పటికీ విడుదల తేదీని కచ్చితంగా లాక్ చేయలేకపోతున్నారు. కేవలం ఒక్క పాట మినహా , షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందని స్వయంగా రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. కానీ రీసెంట్ గా సాయి కుమార్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు , ఆయన మీద కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఒక పక్క షూటింగ్ అయిపోయిందని అంటున్నారు , మరోపక్క సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు , అసలు ఏమి జరుగుతుందో అర్థం అవ్వడం లేదు , పిచ్చెక్కుతుంది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న చిత్రమిది. అలాంటి సినిమా స్టామినా ని మేకర్స్ చేతులారా నాశనం చేస్తున్నారు అంటూ అభిమానులు వాపోతున్నారు.
