Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా వెళ్ళగలరు అని చెప్పడానికి సూపర్ స్టార్ రజినీకాంత్ జీవితం ఒక ఉదాహరణ. సుమారుగా నాలుగు దశాబ్దాలు తమిళనాడు ఇండస్ట్రీ లో తిరుగులేని నెంబర్ 1 స్టార్ గా కొనసాగారు రజినీకాంత్. ఇప్పుడు ఆయన వయస్సు 75 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ కూడా హీరో గా చేస్తూ వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతూ , నేటి తరం సూపర్ స్టార్స్ కి కూడా సాధ్యం అవ్వనటువంటి రికార్డ్స్ ని నెలకొల్పుతూ తనకు తానే పోటీ అని నిరూపించుకుంటున్నారు రజినీకాంత్. అలాంటి సూపర్ స్టార్ జీవిత చరిత్ర గురించి నేటి తరం ప్రేక్షకులు తెలుసుకోవాల్సిందే. తెలుసుకొని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళ రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు.
అయితే త్వరలోనే రజినీకాంత్ బయోపిక్ వెండితెర పై వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే , త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తన జీవిత ప్రయాణం గురించి ఆత్మకథ రాయబోతున్నారట. దీనిపై ఇప్పటి వరకు రజిని టీం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ గత కొంతకాలం నుండి ఆయన ఆత్మకథ రాస్తున్నారని సమాచారం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఆయన వ్యక్తిగత జీవితం లో ఎదురైనా అనుభవాలు , వృత్తిపరంగా ఎదురుకున్న సవాళ్లు , విజయాలు గురించి ఈ ఆత్మకథ లో ఆయన పొందుపర్చబోతున్నారట. కేవలం ఆత్మకథ రాయడం మాత్రమే కాకుండా, దీన్ని సినిమాగా తియ్యాలనే ఆలోచనలో కూడా ఉన్నారట రజినీకాంత్. దీనిపై ఇప్పటికే రజినీకాంత్ తన సన్నిహితులతో చర్చలు జరిపి సలహాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రజినీకాంత్ బయోపిక్ తెరకెక్కిస్తే , అందులో హీరో గా ఎవరు చేస్తే బాగుంటుంది అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది.
రజినీకాంత్ స్టైల్ , మ్యానరిజమ్స్ ని చేయగల యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ బయోపిక్ లో నటిస్తే చాలా బాగుంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ధనుష్ కూడా ఈ బయోపిక్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని మరికొందరు అంటున్నారు. మరి ఎవరు రజినీకాంత్ బయోపిక్ లో హీరో గా నటిస్తే బాగుంటుందో మీరే కామెంట్స్ రూపం లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇకపోతే రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’ ఈ ఏడాది అక్టోబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది.




