Homeఎంటర్టైన్మెంట్Rajendra Prasad apology: మరోసారి నోరు జారీ క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్.. వీడియో వైరల్!

Rajendra Prasad apology: మరోసారి నోరు జారీ క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్.. వీడియో వైరల్!

Rajendra Prasad apology: సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కి దాదాపుగా 70 ఏళ్ళ వయస్సు ఉంటుంది. సినీ ఇండస్ట్రీ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి, నట కిరీటీ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించి, రీసెంట్ గానే పద్మశ్రీ అవార్డు ని సైతం అందుకున్న మహానటుడు ఆయన. అలాంటి నటుడు ఈమధ్య కాలం లో మైక్ అందుకుంటే చాలు, ఎదో ఒక మాట తూలడం , క్షమాపణలు చెప్పడం సర్వసాధారణం అయిపోతుంది. ఒకసారి అయితే పర్వాలేదు, […]

Rajendra Prasad apology: సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కి దాదాపుగా 70 ఏళ్ళ వయస్సు ఉంటుంది. సినీ ఇండస్ట్రీ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి, నట కిరీటీ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించి, రీసెంట్ గానే పద్మశ్రీ అవార్డు ని సైతం అందుకున్న మహానటుడు ఆయన. అలాంటి నటుడు ఈమధ్య కాలం లో మైక్ అందుకుంటే చాలు, ఎదో ఒక మాట తూలడం , క్షమాపణలు చెప్పడం సర్వసాధారణం అయిపోతుంది. ఒకసారి అయితే పర్వాలేదు, కానీ మైక్ అందుకున్న ప్రతీసారి ఈమధ్య కాలం రాజేంద్ర ప్రసాద్ ఎందుకు నోరు జారాల్సి వస్తుంది?, ఆయన స్వభావమే మొదటి నుండి అలా ఉండేదా ?, లేదా వయస్సు పెరిగిన తర్వాత చాదస్తం అలవాటై ఇలా ఆయనకు తెలియకుండానే నోరు జారాల్సి వస్తుందా అనేది అర్థం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. రీసెంట్ గానే ఆయన కాంతారావు అవార్డు ని అందుకున్నాడు.

ఈ అవార్డు ఈవెంట్ కి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ , కాంతారావు ని పొగుడుతూ , తమిళ లెజండరీ సూపర్ స్టార్ , ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి MGR ని తక్కువ చేసి మాట్లాడడం, అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. రాజేంద్ర ప్రసాద్ మాటలను తప్పుబడుతూ సీనియర్ నటుడు నాజర్, హీరో విశాల్ వంటి వారు , తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. హీరో విశాల్ వయస్సు, రాజేంద్ర ప్రసాద్ సినీ కెరీర్ అనుభవం అంత కూడా ఉండదు. అలాంటి వ్యక్తి చేత కూడా అడిగించుకోవాల్సిన దుస్థితి రాజేంద్ర ప్రసాద్ కి ఎందుకు చెప్పండి ?, అసలు రోజురోజుకు ఆయనకు ఏమవుతుందో అసలు అర్థం కావడం లేదంటూ నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టం లేని మనుషులు ఎవ్వరూ ఉండరు, అలాంటి అద్భుతమైన పాత్రలు చేసాడు ఆయన.

Also Read: ‘కాంచన’ రీ రిలీజ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్..కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ లేదుగా!

అలాంటి మనిషి రోజురోజుకు తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడే అని వాపోతున్నారు నెటిజెన్స్. అయితే తమిళియన్స్ నుండి రాజేంద్ర ప్రసాద్ కచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ రావడం తో, ఆయన కాసేపటి క్రితమే తమిళం లో క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేశాడు . అందులో ఆయన మాట్లాడుతూ ‘MGR గారు తమిళనాడు ప్రజలకు ఆరాధ్య దైవం లాంటి వాడు. రీసెంట్ గా జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో కాంతారావు గారిని పొగుడుతూ , పొరపాటున MGR గారి మీద నోరు జారాను. అది కావాలని చేసినది కాదు, నా ఉద్దేశ్యం ఆయన్ని తక్కువ చెయ్యాలని కాదు. నా మాటలు తమిళ ప్రజల మనసుల్ని నొప్పించాయని తెలుస్తుంది. అందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు రాజేంద్ర ప్రసాద్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper