Homeఎంటర్టైన్మెంట్Rajamouli- Mahesh Babu: రాజమౌళి మాస్టర్ ప్లాన్... మహేష్ తండ్రిగా ఆ స్టార్ హీరో!

Rajamouli- Mahesh Babu: రాజమౌళి మాస్టర్ ప్లాన్… మహేష్ తండ్రిగా ఆ స్టార్ హీరో!

Rajamouli- Mahesh Babu: సినిమా సినిమాకు రాజమౌళి తన కీర్తి పెంచుకుంటూ పోతున్నాడు. బాహుబలి చిత్రాలతో దేశాన్ని ఆకర్షించిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీతో అంతర్జాతీయ గుర్తింపు ఆర్జిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ గ్లోబల్ సినిమా వేదికపై సత్తా చాటుతుంది. ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుపొందిన ఆర్ ఆర్ ఆర్, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్స్ కి నామినేషన్స్ దక్కించుకుంది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిస్తే రాజమౌళి ప్రతిష్ట మరింత పెరుగుతుంది. ఆస్కార్ గెలుచుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

Rajamouli- Mahesh Babu
Rajamouli- Mahesh Babu

ఈ క్రమంలో మహేష్ మూవీ ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని ఇప్పటికే రాజమౌళి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. కథ, జోనర్ పై కూడా అవగాహన కలిగించారు. మహేష్ కి యాక్షన్ అడ్వెంచర్ కథ సెట్ అవుతుందని నమ్మిన రాజమౌళి తనతో ఆ తరహా స్క్రిప్ట్ సిద్ధం చేయించారని వెల్లడించారు. ఎప్పటి నుండో మహేష్ కోసం అనుకుంటున్న కథకు మెరుగులు దిద్ది సరికొత్తగా సిద్ధం చేసినట్లు విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు.

ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం రాజమౌళి 5 ఏళ్ల సమయం కేటాయించారు. దీంతో మహేష్ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా నడుస్తున్నాయి. సాంకేతిక నిపుణులు, క్యాస్టింగ్ స్టార్ట్ చేశారు. 2023 మే లేదా జూన్ నుండి రెగ్యులర్ షూట్ స్టార్ కావచ్చని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పాన్ వరల్డ్ చిత్రానికి అదే స్థాయిలో క్యాస్టింగ్ ని సిద్ధం చేస్తున్నారు. మహేష్ తండ్రిగా సీనియర్ స్టార్ హీరో నటిస్తున్నట్లు క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది.

Rajamouli- Mahesh Babu
Rajamouli- Mahesh Babu

కథలో హీరో తండ్రి పాత్రకు గొప్ప నేపథ్యం ఉంటుందట. చాలా కీలకమైన ఈ పాత్ర బాగా పేరున్న స్టార్ యాక్టర్ చేస్తేనే సినిమాకు ప్లస్ అవుతుందని నమ్మిన రాజమౌళి ఏకంగా అమితాబ్ ని లైన్లోకి తెచ్చారట. మహేష్ తండ్రి పాత్ర కోసం అమితాబ్ ని సంప్రదించడం, ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయట. రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ కి అమితాబ్ సైన్ చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ న్యూస్ మహేష్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. కాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీలో సైతం అమితాబ్ కీలక రోల్ చేస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper