Rajamouli: తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి(SS Rajamouli) అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆయన గర్వకారణం. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమని ఎలా అయితే ఏలారో, నేటి తరం లో రాజమౌళి అలా ఏలుతున్నాడు. ప్రస్తుతానికి ఆయన స్టార్ స్టేటస్ ముందు ఇండియా లో ఏ స్టార్ అయినా చిన్నోడే. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మాట మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి?, నీ మాటలకు ప్రభావితం అయ్యే వాళ్ళు కోట్లలో ఉంటారు. నిన్ను నమ్మి వాళ్ళు కూడా అలాగే తయారైతే ఏంటి పరిస్థితి?, ఇంత గర్వం, ఇంత అహంకారం ఎందుకు?, కెరీర్ మొత్తం సూపర్ హిట్స్ ఉండడం తో తలపొగరు ఆకాశాన్ని అంటిందా వంటి సందేహాలు రాజమౌళి ని చూస్తే కలుగుతున్నాయి.
శుభమా అంటూ దేవుడి ఆస్సీసులతో నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో #Globetrotter వారణాసి మూవీ కి సంబంధించిన మొట్టమొదటి ఈవెంట్ ని జరిపించారు. ఈ ఈవెంట్ ని ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువు గా మార్చేశాడు రాజమౌళి. నేను దేవుడ్ని నమ్మను, కానీ మా నాన్న నమ్ముతాడు, నా భార్య నమ్ముతుంది, హనుమంతుడు అంటే వాళ్లకు చాలా ఇష్టం, కానీ దేవుడు నిజంగా ఉండుంటే ఇలాంటి పనులు చేస్తాడా?, దేవుడ్ని నమ్ముతున్న వాళ్ళను చూస్తుంటే నాకు కోపం వస్తుంది అంటూ రాజమౌళి నిన్న మాట్లాడిన మాటలు ఇవి. ఎందుకు ఇలా మాట్లాడాడు అంటే LED స్క్రీన్ మీద వారణాసి గ్లింప్స్ వీడియో సరిగా ప్లే అవ్వలేదట. గ్లింప్స్ సరిగా ప్లే అవ్వకపోతే నీ టెక్నీకల్ టీం ని తిట్టాలి కానీ, దేవుడిని నిందించడం ఏంటి?, దేవుడి మీద సినిమా తీస్తూ, దేవుడినే నిందించడం ఎంత వరకు సమంజసం?.
ఇలా చేస్తే ఆ దేవుడి ఆశీస్సులు సినిమా మీద ఉంటాయా? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ రాజమౌళి ని ఏకిపారేస్తున్నారు. అంతే కాదు గతం లో ఆయన శ్రీరాముడి పై చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక అభిమాని రాజమౌళి ని ట్యాగ్ చేస్తూ శ్రీ రామనవమి శుభాకాంక్షలు చెప్తాడు. దానికి రాజమౌళి సమాధానం చెప్తూ ‘థాంక్యూ..కానీ నాకు శ్రీ రాముడు అంటే అసలు ఇష్టం లేదు. నారాయణ అవతారాల్లో నాకు శ్రీ కృష్ణుడు అంటేనే ఎక్కువ ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు. అభిమాని ట్యాగ్ చేసి శుభాకాంక్షలు చెప్తే, ధన్యవాదాలు, మీకు కూడా శుభాకాంక్షలు అని చెప్తే సరిపోతాది కదా, ఇదంతా అవసరమా?, దేవుడి మీద ఎంత ద్వేషం లేకపోతే ఇలాంటివి నోటి నుండి వస్తాయి చెప్పండి?, ఇది చిన్న వ్యవహారం కాదు, దీనిపై రాజమౌళి రాబోయే రోజుల్లో పెద్ద సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుంది.
@yourstarun85 Tq. But I never liked lord ram. Lord Krishna is my favourite of all the avatars.
— rajamouli ss (@ssrajamouli) April 12, 2011