Chiranjeevi And Rajinikanth: గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా తయారయింది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి సినిమా డైరెక్టర్లుగా, హీరోలుగా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే ప్రతిభ ఉందా? లేదా అనేది ఎవరు పట్టించుకోవడం లేదు. డబ్బులు ఉన్న ప్రతి వాళ్లు సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ అది కష్టతరమవుతోంది. ఒకప్పుడు చిరంజీవి లాంటి హీరో రజినీకాంత్ లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చిన్న చిన్న పాత్రలను చేసి స్టార్ హీరోలుగా ఎదిగారు. ఈరోజు వాళ్ల సినిమాల్ని మనం ఆదరిస్తున్నాం అంటే అప్పట్లో వాళ్ళు ఎంతలా కష్టపడి ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నారు మనం అర్థం చేసుకోవచ్చు… మొత్తానికైతే వాళ్ళు జనాల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆ రేంజ్ లో ఉందనే చెప్పాలి. రజనీకాంత్, చిరంజీవి మధ్య ఒకానొక సందర్భంలో విపరీతమైన పోటీ ఉండేది.
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు, ఎవరు సౌత్ సినిమాని రూల్ చేసే స్థాయిలో ఉన్నారు అనే విషయం మీద చాలా రకాల వార్తలైతే వెలువడ్డాయి. నిజానికి భాషా సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న రజినీకాంత్ ఆ సినిమాతో తెలుగులోనూ స్టార్ హీరోగా అవతరించాడు. ఇక ఆ సినిమా చూసిన తర్వాత చిరంజీవికి కొంతవరకు భయం కలిగిందట.
ఎందుకంటే అప్పటికే రజనీకాంత్ మాస్ హీరోగా అవతరించడమే కాకుండా కొత్త దనాన్ని తీసుకొచ్చే సినిమాని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాంతో చిరంజీవి ఎలాగైనా సరే తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వరుసగా హిట్లర్, మాస్టర్, చూడాలని ఉంది లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించి టాప్ రేంజ్ లోకి వెళ్లాడు.
నిజానికి వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ హీరో అనేది చెప్పడం కష్టం ఎందుకంటే ఇద్దరు కూడా మాస్ లో విపరీతంగా పట్టున్న హీరోలు కావడం వల్ల ఇద్దరికీ ఇండస్ట్రీని శాసించే కెపాసిటీ ఉంది. అందువల్లే వాళ్ళు ఇప్పటికి నెంబర్ వన్ హీరోలు గానే కొనసాగుతున్నారు. వాళ్ళని రీప్లేస్ చేసే హీరోలు ఈతరం ఇండస్ట్రీలో ఎవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…