Rajamouli praises Aditya Dhar: ప్రస్తుతం పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెసు లుగా మారుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలు ఇంతకుముందే పాన్ ఇండియా ను షేక్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు రానున్న సినిమాలతో సైతం మరోసారి మన సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లో ఉండేలా చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ నుంచి వచ్చిన ‘దురంధర్ 2’ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటూ ఒక ట్వీట్ చేశాడు. ఇక అలాంటి రాజమౌళి ‘దురంధర్ 2’ సినిమా దర్శకుడు అయిన ఆదిత్య ధర్ ను పొగుడుతూ చాలా మాటలైతే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ ను చూసి మనం చాలా నేర్చుకోవాలి అనే రేంజ్ లో మాట్లాడాడట.
ఎందుకంటే ఆయన చాలా తక్కువ సమయంలోనే దురంధర్ మూవీ రెండు పార్టీలను తెరకెక్కించాడు. ఈ సినిమాలు ఏడున్నర గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం…అంత పెద్ద సినిమాను అన్ని తక్కువ రోజుల్లో ఎలా తెరకెక్కించారనే విషయంలో మనం ఆదిత్య ధర్ ను మెచ్చుకోవాలి. ఒకరకంగా ఆయన నుంచి మనం నేర్చుకోవాలి అంటూ రాజమౌళి కూడా తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట.
రెండు సంవత్సరాల్లోనే దురంధర్ రెండు పార్టులు కలిపి ఏడున్నర గంటల నిడివితో ఉన్న సినిమా చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొదటి పార్ట్ మూడున్నర గంటలుండగా, దురంధర్ 2 సినిమా సైతం నాలుగు గంటల నిడివి ఉంది. అయినప్పటికి ఎక్కడ కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా ముందుకు సాగుతుంది.
మొదటి సీన్ తోనే సినిమాలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ వెళ్లకుండా ప్రతి విషయాన్ని స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు…ఇక ఆదిత్యధర్ చాలా పెద్ద దర్శకుడుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…