Homeవార్త విశ్లేషణSnake Farming Village China: ఇది మాములు ఊరు కాదు..వారు పెంచేవి చూస్తే భయపడుతూ పరుగులు...

Snake Farming Village China: ఇది మాములు ఊరు కాదు..వారు పెంచేవి చూస్తే భయపడుతూ పరుగులు తీయడం గ్యారెంటీ

Snake Farming Village China: ఊరు అనగానే మన కళ్ల ముందు పచ్చటి వాతావరణం కనిపిస్తుంది. పంట పొలాలు, చెరువులు, కాలువలు, పనులకువెళ్లే మనుషులతో పల్లె వాతావరణం కనులవిందు చేస్తుంది. గ్రామాలలో వ్యవసాయం అనేది ప్రధాన వ్యాపకం. కొందరు అనుబంధంగా పశువులను పెంచుతారు. ఇంకొదరయితే కోళ్లను, బాతులను, మేకలు, గొర్రెలను పెంచుతూ జీవనం సాగిస్తుంటారు. అనుబంధ రంగాల ద్వారా లభించే ఆదాయంతో రైతులు ఉపాధి పొందుతుంటారు. మన దేశంలోని దాదాపు అన్ని గ్రామాలలో పై ఉపోద్ఘాతం మాదిరిగానే […]

Snake Farming Village China: ఊరు అనగానే మన కళ్ల ముందు పచ్చటి వాతావరణం కనిపిస్తుంది. పంట పొలాలు, చెరువులు, కాలువలు, పనులకువెళ్లే మనుషులతో పల్లె వాతావరణం కనులవిందు చేస్తుంది. గ్రామాలలో వ్యవసాయం అనేది ప్రధాన వ్యాపకం. కొందరు అనుబంధంగా పశువులను పెంచుతారు. ఇంకొదరయితే కోళ్లను, బాతులను, మేకలు, గొర్రెలను పెంచుతూ జీవనం సాగిస్తుంటారు. అనుబంధ రంగాల ద్వారా లభించే ఆదాయంతో రైతులు ఉపాధి పొందుతుంటారు.

మన దేశంలోని దాదాపు అన్ని గ్రామాలలో పై ఉపోద్ఘాతం మాదిరిగానే పరిస్థితి ఉంటుంది. కానీ, ఓ గ్రామంలో ప్రజలు వ్యవసాయం చేస్తారు. ఉపాధి కోసం పశువులను, మేకలు, కోళ్లు, గొర్రెలు కాకుండా పాములను పెంచుతున్నారు. చదువుతుంటే భయం వేస్తుంది కదా.. ఔను నిజమే.. అక్కడి రైతులు ఉపాధి కోసం పాములను పెంచుతున్నారు.

చైనా దేశంలోని జిసికియావో గ్రామస్థులకు పాములను పెంచడం ప్రధాన ఉపాధి మార్గం. ఈ గ్రామంలో వేయి మందివరకు ఉంటారు. ఊరిలో ప్రతీ ఒక్కరు పాములను పెంచుకుంటూ జీవిస్తుంటారు. దశాబ్దాలు వారంతా ఇదే పని చేస్తున్నారు. అప్పట్లో ఈ గ్రామానికి చెందిన వారు సరదాగా పాములు పెంపకాన్ని మొదలు పెట్టారు. అది కాస్త వారికి ప్రధాన వ్యాపకం లాగా మారిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్ పాము విషానికి విపరీతమైన డిమాండ్ ఉంది. పాము చర్మానికి కూడా భారీగా డిమాండ్ ఉంది. అందువల్లే ఈ గ్రామానికి చెందినవారు పాములను పెంచుతున్నారు. పాముల పెంపకం ప్రమాదకరమైనప్పటికీ ఆదాయం భారీగా ఉండటంతో వారు పాములను పెంచుతున్నారు. ఈ పాములను పెంచడం ద్వారా వారు ఏకంగా కోటీశ్వరులయ్యారు. ఇలా పాములను పెంచాలంటే చైనా ప్రభుత్వం నుంచి శిక్షణ తీసుకోవాలి. లైసెన్స్ కూడా పొందాలి.

గ్రామస్థులు పెంచేవాటిలో అత్యంత విషపూరితమైన సర్పాలు ఉంటాయి. వాటిని పెంచేప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. సాంకేతికంగా కొన్ని నిబంధనలను అనుసరించాలి. పాములు పిల్లలు పెట్టేటప్పడు, కలయికలో పాల్గొనేటప్పుడు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. అప్పుడే వాటి సంతతి పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో పాముల విషానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పాముల చర్మంతో రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper