Homeఎంటర్టైన్మెంట్Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్... ఆయన...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నప్పటికి ఆయన సినిమాలు లేటుగా వస్తుంటాయి. అని కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. నిజానికి రాజమౌళి చేసేవి విజువల్ వండర్ […]

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నప్పటికి ఆయన సినిమాలు లేటుగా వస్తుంటాయి. అని కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. నిజానికి రాజమౌళి చేసేవి విజువల్ వండర్ సినిమాలు కాబట్టి వాటికి ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే సిజి వర్క్ హెవీగా ఉండటం వల్ల దానిని పర్ఫెక్ట్ గా సెట్ చేయడానికి సమయం అయితే తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి క్రమంలో రాజమౌళి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలన్నీ కూడా హెవీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం వారణాసి సినిమాతో ఆయన మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

రాజమౌళి సినిమాకి కథా రచయితగా తన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ పని చేస్తుంటాడనే విషయం మనందరికీ తెలిసిందే. రాజమౌళికి నచ్చినట్టుగా కథ రాయడం అనేది పెద్ద టాస్క్ అంటూ విజయేంద్రప్రసాద్ గతంలో కొన్ని సందర్భాల్లో వివరించాడు.

రాజమౌళి కొన్ని ఫైట్ సీక్వెన్స్ ని ముందుగానే అనుకొని దానికి తగ్గట్టుగా కథ ను డిజైన్ చేయమని విజయేంద్రప్రసాద్ కి చెబుతాడట. వాటన్నింటిని అందులో సెట్ చేయడానికి విజయేంద్రప్రసాద్ చాలా వరకు కష్టపడుతూ ఉంటాడట. తద్వారా కథను ఒక షేపుకి తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని ఆయన చెప్పడం విశేషం…

మగధీర సినిమాలో ముందుగా వంద మందిని చంపే ఒక యోధుడి క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని ఆ తర్వాత కథని రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో రాజమౌళిని మించిన దర్శకుడు మరొకరు లేరనే చెప్పాలి. ఆయనలో ఉన్న విజన్ ను పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తుంటాడు. కాబట్టి అందుకే ఆయన టాప్ పొజిషన్లో ముందుకు దూసుకెళ్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper