Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరించే అవకాశమైతే ఉంది…ప్రస్తుతం వారణాసి సినిమాతో […]

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరించే అవకాశమైతే ఉంది…ప్రస్తుతం వారణాసి సినిమాతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే గతంలో మహేష్ బాబు చేసిన సినిమాలు కొన్ని అతన్ని తీవ్రంగా నిరాశపరిచాయి.

దర్శకుల మీద ఆయన చాలా కాన్ఫిడెన్స్ పెట్టుకున్నప్పటికి వాళ్ళు మహేష్ అనుకున్న రేంజ్ లో వాళ్ళు సినీ తీయలేదని అందువల్లే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటూ గతంలో మహేష్ బాబు క్లారిటి ఇచ్చాడు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన నాని సినిమా మీద మహేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడట. ఆ సినిమా ప్రయోగాత్మకంగా ఉందని చాలా బాగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఆ సినిమాని ఓకే చేశాడు.

అయినప్పటికి ఆ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేను కారణమేంటంటే దర్శకుడు దానిమీద పూర్తి ఎఫర్ట్స్ పెట్టినప్పటికి ఆ సినిమాలో ఏదో తేడా కొట్టడం వల్ల అలా అయిపోయిందని ఆయన చెప్పాడు. టక్కరి దొంగ సినిమా విషయంలో కూడా అలాగే జరిగిందని అందుకే ఆయన దర్శకుల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడని చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం మహేష్ బాబు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

కాబట్టి ఇక తన రేంజ్ మారబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇకమీదట నుంచి ఆయన చేయబోతున్న సినిమాలన్నీ కూడా అతనికి పర్ఫెక్ట్ సక్సెస్ లను సాధించిపెట్టే విధంగా ఉండాలని అంతే తప్ప మధ్యలో ప్లాప్ లను మూటగట్టుకునే ఉద్దేశ్యం తనకు లేదని పలు సందర్భాల్లో క్లారిటిని ఇచ్చే ప్రయత్నం చేశాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper