Homeఎంటర్టైన్మెంట్Rajamouli Birthday: రాజమౌళి.. దేశ సినీ రంగాన్ని చెక్కిన ఓ ఆధునిక దర్శకరత్నం...

Rajamouli Birthday: రాజమౌళి.. దేశ సినీ రంగాన్ని చెక్కిన ఓ ఆధునిక దర్శకరత్నం…

Rajamouli Birthday: తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి… పాన్ ఇండియాలో ఆయనను మించిన దర్శకుడు మరెవరు లేరు. ఒక కథ మీద అతనికి ఉన్న నాలెడ్జ్ గాని, దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం గాని ఒక ఎమోషన్ సీన్ లో ఎలివేషన్ ను ఎలా ఆడ్ చేయాలో అతనికి తెలిసినంత గొప్పగా మరెవ్వరికి తెలియదు. అలాంటి ఒక దర్శకుడు ఇప్పుడు పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి […]

Rajamouli Birthday: తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి… పాన్ ఇండియాలో ఆయనను మించిన దర్శకుడు మరెవరు లేరు. ఒక కథ మీద అతనికి ఉన్న నాలెడ్జ్ గాని, దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం గాని ఒక ఎమోషన్ సీన్ లో ఎలివేషన్ ను ఎలా ఆడ్ చేయాలో అతనికి తెలిసినంత గొప్పగా మరెవ్వరికి తెలియదు. అలాంటి ఒక దర్శకుడు ఇప్పుడు పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్తున్నాడు… ఇక అలాంటి రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలను చేస్తే అందులో అవన్నీ సూపర్ సక్సెస్ లను సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క సినిమాతో సక్సెస్ వస్తే చాలు అనుకుంటున్న చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళు రాజమౌళితో పోటీ పడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎలాంటి పోటీ ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాని ఎలా తీయాలి అనే దానిమీద అతనికి ఉన్న క్లారిటీ మరెవరికి లేదనే చెప్పాలి…

అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా అతను ఎప్పుడు తన గర్వాన్ని ఎవరికి చూపించలేదు. అందరి ముందు చాలా హంబుల్ గా ఉంటూ తనలో ఏదైతే కావాలో దాన్ని అతనే యాక్టింగ్ చేసి చూపిస్తుంటారు. మొత్తానికి ఆయన సక్సెస్ వెనక ఆయన పడిన కష్టం మనకు కనిపిస్తుంటుంది. బాహుబలి సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు…

ఎక్కడో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సినిమాలు చేసుకునే రాజమౌళి గురించి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రపంచం లోనే టాప్ 3 దర్శకులలో ఒకరైన జేమ్స్ కామెరూన్ మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు…అలాగే రాజమౌళి చేసిన త్రిబుల్ ఆర్ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడాడు…ఇక రాజమౌళి ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.అతన్ని మించినవారు మరొకరు లేకపోవడం విశేషం…

దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి ఈరోజు తన బర్త్ డే ను జరుపుకుంటున్నారు…ఇక ఇప్పటికే ఆయనకి చాలా మంది సినిమా సెలబ్రిటీస్ విశేష్ ను తెలియజేయడం విశేషం…ఇక రాజమౌళి వేసిన బాటలోనే నడుస్తున్న మన స్టార్ డైరెక్టర్లు సైతం ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం అని చెప్పడం విశేషం… రాజమౌళి ఫ్యూచర్ లో ఇంకా గొప్ప సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలని కోరుకుందాం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper