Balakrishna Raghava Lawrence latest news: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపుని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా జాగ్రత్తలను తీసుకుంటున్నాడు. మొదటి నుంచి కూడా మాస్ కమర్షియల్ సినిమాల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చిన బాలయ్య బాబు ఇప్పుడు కూడా అలాంటి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తే అవి సక్సెస్ అవుతాయో, ఫెయిల్యూర్ అయితాయో తెలియడం లేదు. దాని వల్ల ప్రొడ్యూసర్ ను రిస్క్ లో పెట్టిన వాళ్ళం అవుతున్నాం అనే ఉద్దేశ్యంతోనే బాలయ్య బాబు ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాఘవ లారెన్స్ లాంటి కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారి నాగార్జునతో మాస్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన రాఘవ లారెన్స్ ఆ తర్వాత బాలయ్య బాబుతో సినిమా చేయడానికి అవకాశం అందుకున్నాడు.
మొత్తానికైతే ఏం జరిగిందో తెలియదు గానీ మొత్తానికైతే ఈ సినిమా పట్టలెక్కలేదు. ఇక అదే సమయంలో రాఘవ లారెన్స్ స్టైల్ అనే సినిమాని తీశాడు. ఆ సినిమా డ్యాన్స్ ప్రాధాన్యంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. లారెన్స్ లాంటి కొరియోగ్రాఫర్ దర్శకుడిగా రాణిస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లారెన్స్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి ఉంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండేదని చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు…ఫ్యూచర్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే చెప్పాలి.
రీసెంట్ గా లారెన్స్ బాలయ్య బాబుకి ఒక కథనైతే వినిపించారట. బాలయ్య కి కథ బాగా నచ్చిందట కానీ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదట… బాలయ్య ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి అయిన తర్వాత లారెన్స్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…
