Homeఎంటర్టైన్మెంట్Meenakshi Chaudhary crush on star hero: ఆ స్టార్ హీరోపై మనసుపడ్డ మీనాక్షి చౌదరి.....

Meenakshi Chaudhary crush on star hero: ఆ స్టార్ హీరోపై మనసుపడ్డ మీనాక్షి చౌదరి.. వైరల్ అవుతున్న హాట్ కామెంట్స్..

Meenakshi Chaudhary crush on star hero: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన వారిలో ఒకరు మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). యూత్ ఆడియన్స్ లో ఈమెకు ఉన్న క్రేజ్ సాధారమైనది కాదు. ఈమె కెరీర్ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రం తో మొదలైంది. సుశాంత్ ఇందులో హీరో, ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో , ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. […]

Meenakshi Chaudhary crush on star hero: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన వారిలో ఒకరు మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). యూత్ ఆడియన్స్ లో ఈమెకు ఉన్న క్రేజ్ సాధారమైనది కాదు. ఈమె కెరీర్ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రం తో మొదలైంది. సుశాంత్ ఇందులో హీరో, ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో , ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. అంత పెద్ద ఫ్లాప్ అన్నమాట. ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి, ఈరోజు ఈ స్థాయికి చేరుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు కేవలం ఆమె తెలుగు లోనే కాదు, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా వరుసగా అవకాశాలు సంపాదిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఆరంభం లో ఈమె హీరోయిన్ గా నటించిన ప్రతీ సినిమా ఫ్లాప్ అయ్యేది.

కానీ ‘లక్కీ భాస్కర్ ‘ చిత్రంతో ఈమెకు సూపర్ హిట్స్ మొదలయ్యాయి. ఆ చిత్రం తర్వాత విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. నటిగా కూడా మీనాక్షి చౌదరి ఈ చిత్రం తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె నుండి విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకు టాలీవుడ్ లో బాగా క్రష్ ఉన్న హీరో గురించి హాట్ కామెంట్స్ చేస్తూ సంచలనంగా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయన మీద నాకు క్రష్ ఉంది. ఆయన నటనతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా నేను ఎంతగానో ఇష్టపడతాను. ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో ఇప్పుడు సోషల్ మీడియా లో మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. కొంతమంది అయితే విమర్శిస్తున్నారు. ఎందుకంటే గతం లో ఆమె పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ అంటోంది , చూస్తుంటే ఈమె అవకాశాల కోసం ఇంకో సందర్భంలో మహేష్ బాబు , రామ్ చరణ్ పేర్లు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కామెంట్స్ చేసేస్తున్నారు. ఇకపోతే మీనాక్షి చౌదరి ప్రస్తుతం నాగచైతన్య తో ‘వృష కర్మ’ అనే మిస్టిక్ హారర్ చిత్రం చేస్తోంది. ఈ సినిమాతో పాటు ఆమె ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న చిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది , మరో హీరోయిన్ గా ఇందులో శ్రీలీల నటిస్తోంది. అంతే కాకుండా సిద్దు జొన్నలగడ్డ , వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రాబోతున్న నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించబోతుంది. అదే విధంగా హిందీ లో కూడా ఒక చిత్రం ఒప్పుకుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper