Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 and Kantara 2  : ఈ రెండు సీక్వెల్స్ కి మంచి క్రేజ్...

Pushpa 2 and Kantara 2  : ఈ రెండు సీక్వెల్స్ కి మంచి క్రేజ్ దక్కుతుందా..? వీటిలో ఏ సినిమా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఒక పార్ట్ హిట్ అయితే చాలు ప్రతి సినిమాకు సీక్వెల్స్ ను అనౌన్స్ చేస్తున్నారు... మరి వాటి ద్వారా వాళ్ళు ఎంత వరకు సక్సెస్ సాధిస్తారు అనేది మాత్రం ఎవ్వరు ఆలోచించడం లేదు...

Pushpa 2 and Kantara 2  :  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి ఒక సినిమా సూపర్ సక్సెస్ అయిందంటే ఆ సినిమా నుంచి సీక్వెల్ గా మరొక సినిమా వచ్చి సూపర్ సక్సెస్ లు అవ్వడానికి పునాదిగా మారుతున్నాయి. ఇక సక్సెస్ ఫుల్ సినిమాకి సీక్వెల్ గా మరొక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరిలో ఈ సినిమా పట్ల భారీ అంచనాలైతే ఉంటాయి. ఇక సీక్వెల్ గా వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగలిగితే ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం ఈ సినిమాతో పాటు ఆ పేరు వాడుకున్నందుకు మొదటి పార్ట్ కి కూడా చాలావరకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు సీక్వెల్ గా వచ్చిన కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం భారీ డిజాస్టర్లు గా మిగిలాయి. నిజానికి ఒక ఫ్రెష్ స్టోరీ ని తీయడం చాలా ఈజీ, కానీ సీక్వెల్ సినిమా తీయాలి అంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని…ఎందుకంటే ఇంతకుముందు ఆ సినిమా సాధించిన సక్సెస్ ను మ్యాచ్ చేస్తూ ఈ సినిమాని తీయాలి. ఆ సినిమా కంటే సీక్వెల్ కొంచెం తక్కువగా ఉన్న కూడా సినిమా మీద భారీ విమర్శలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికి మనం ఇలాంటి సందర్భాలను చాలాసార్లు చాలా సినిమాల విషయంలో చూస్తూనే వచ్చాం…కాకపోతే ఇప్పుడు కొన్ని సీక్వెల్స్ సినిమాలు చాలా క్యూరియాసిటి ని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…

పుష్ప 2

నిజానికి ఏ సినిమా సీక్వెల్ కి లేనంత క్రేజ్ పుష్ప 2 సినిమాకు ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలో పుష్ప సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. పుష్ప సినిమాకు మించి పుష్ప 2 ఉంటేనే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. ఇక ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. లేకపోతే మాత్రం అటు సుకుమార్ , ఇటు అల్లు అర్జున్ భారీ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది…

కంతార 2

ముఖ్యంగా కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కాంతార 2’ సినిమాను కూడా రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నాడు. నిజానికి కాంతార సినిమా పాన్ ఇండియా వైడ్ గా మంచి సక్సెస్ ను అందుకుంది. మరి కాంతార 2 సినిమాకి కూడా అంతటి ఆదరణ లభిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. ఈ ఈ రెండింటి మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి కాబట్టి రెండు సినిమాలు పెద్ద హిట్లుగా నిలిచే అవకాశం అయితే ఉంది. కాకపోతే పుష్ప 2 కి ఉన్న హైప్ వల్ల ఆ సినిమా కంతార 2 కంటే కొంచెం ఎక్కువ సక్సెస్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఇక ఇదిలా ఇంకా సెట్స్ మీదికి వెళ్లకుండా అనౌన్స్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా చాలా కీలకపాత్ర వహిస్తున్నాయి. ఇక దీంతోపాటుగా ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ సినిమాకి మూడో పార్ట్ ను కూడా రెడీ చేస్తున్నారు. మరి వీటిలో ఏ సినిమాలు సక్సెస్ లను సాధిస్తాయి. ఏ సినిమాలు ప్లాప్ అయి ఆయా మేకర్స్ కి బ్యాడ్ నేమ్ ని తీసుకొస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper