Homeఎంటర్టైన్మెంట్అందుకే లావు అయ్యాను: ప్రియాంకా జవాల్కర్‌

అందుకే లావు అయ్యాను: ప్రియాంకా జవాల్కర్‌

తెలుగు సినిమా హీరోయిన్ అనగానే స్లిమ్ గా ఉండాలి, గ్లామర్ డాల్ గా ఉండాలి అంటూ అనేక షరతులు పెడుతూ ఉంటారు. అందుకే, హీరోయిన్లు కూడా స్లిమ్ గా కనిపించడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఒకేవేళ ఫిజిక్ మెయింటైన్ చేయలేక లావు అయితే.. వెంటనే వారి పై విమర్శలు బూతులు ఎక్కువైపోతాయి. అందుకే అవకాశాలు కోసం బరువు పెరగకుండా హీరోయిన్లు కూడా తమ నోటికి తాళం వేసుకుంటారు. కాకపోతే, లావు అనేది ఫుడ్ వల్ల మాత్రమే […]

Priyanka Jawalkarతెలుగు సినిమా హీరోయిన్ అనగానే స్లిమ్ గా ఉండాలి, గ్లామర్ డాల్ గా ఉండాలి అంటూ అనేక షరతులు పెడుతూ ఉంటారు. అందుకే, హీరోయిన్లు కూడా స్లిమ్ గా కనిపించడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఒకేవేళ ఫిజిక్ మెయింటైన్ చేయలేక లావు అయితే.. వెంటనే వారి పై విమర్శలు బూతులు ఎక్కువైపోతాయి. అందుకే అవకాశాలు కోసం బరువు పెరగకుండా హీరోయిన్లు కూడా తమ నోటికి తాళం వేసుకుంటారు.

కాకపోతే, లావు అనేది ఫుడ్ వల్ల మాత్రమే రాదుగా. అందుకే, కొంతమంది హీరోయిన్లు కొన్ని కారణాల వల్ల లావు అవుతుంటారు. అలాగే లావు అయింది ‘ప్రియాంకా జవాల్కర్‌’. అయితే, ఆమె బరువు గురించి ప్రియాంక మాటల్లోనే.. ‘తిమ్మరుసు’ సినిమాలో నా శరీరాకృతి పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు అంటూ నా గురించి రూమర్స్ కూడా క్రియేట్ చేశారు.

నిజానికి నేను ఎందుకు బరువు పెరిగానో ఆ సమయంలో నాక్కూడా అర్థం కాలేదు. రీసెంట్ గా బ్లడ్‌ టెస్ట్‌ చేయిస్తే నాకు థైరాయిడ్, ఇన్సులిన్‌ రెసిస్టెన్సీ సమస్య అని చెప్పారు. ప్రస్తుతం నేను నా శరీరాకృతి పై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. డాక్టర్స్‌ సలహాలతో ఫుడ్, వ్యాయామం ఇలా అన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా బరువులో కూడా ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది.

త్వరలోనే బరువు తగ్గుతాను. అయితే, నా బరువు పై విమర్శలు చేసే వాళ్ళకు ఒకటి తెలియాలి. మనం ఉన్న లావు కంటే.. స్క్రీన్‌ పై 30 శాతం అధిక లావుతో కనిపిస్తాం. బహుశా చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. అయినా హీరోయిన్ స్క్రీన్‌ మీద కూడా స్లిమ్‌ గానే కనిపించాలి. అలా కనిపించాలి అంటే.. చాలా చాలా స్లిమ్‌గా ఉండాలి. ప్రస్తుతం నేను స్లిమ్ అయ్యే పనిలో ఉన్నాను.

ఇక థియేటర్స్‌ రీఓపెన్‌ చేసిన తర్వాత నేను హీరోయిన్‌ గా చేసిన రెండు చిత్రాలు వన్ వీక్ గ్యాప్‌ లో రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ సాధిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా రెండు సినిమాలకు ఇలా మంచి స్పందన రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper