Homeఎంటర్టైన్మెంట్పెళ్లి చేసుకుంది.. ప్లాప్ అయింది !

పెళ్లి చేసుకుంది.. ప్లాప్ అయింది !

హోమ్లీ హీరోయిన్ గా ప్రణీత సుభాష్ కి మంచి ఇమేజ్ ఉంది. కానీ, ఎందుకో ఆమెకు మొదటి నుండి మంచి అవకాశాలు రాలేదు. అందం ఉన్నా, అణుకువ ఉన్నా, అన్నిటికి మించి మంచితనం ఉన్నా.. ఉన్నతమైన సినిమాలు ఆమె చెంతకు చేరలేదు. చాల కాలంగా సెకెండ్ లెవల్ హీరోయిన్ గా మిగిలిపోయింది ప్రణీత. ఇక ఇటీవల పెళ్లి కూడా చేసుకొంది ఈ హోమ్లీ బ్యూటీ. అయితే, పెళ్లికి ముందు ఈ అమ్మడు బాలీవుడ్ లోకి గ్రాండ్ గా […]

Pranitha Subhash Hungama 2హోమ్లీ హీరోయిన్ గా ప్రణీత సుభాష్ కి మంచి ఇమేజ్ ఉంది. కానీ, ఎందుకో ఆమెకు మొదటి నుండి మంచి అవకాశాలు రాలేదు. అందం ఉన్నా, అణుకువ ఉన్నా, అన్నిటికి మించి మంచితనం ఉన్నా.. ఉన్నతమైన సినిమాలు ఆమె చెంతకు చేరలేదు. చాల కాలంగా సెకెండ్ లెవల్ హీరోయిన్ గా మిగిలిపోయింది ప్రణీత. ఇక ఇటీవల పెళ్లి కూడా చేసుకొంది ఈ హోమ్లీ బ్యూటీ.

అయితే, పెళ్లికి ముందు ఈ అమ్మడు బాలీవుడ్ లోకి గ్రాండ్ గా అడుగుపెట్టింది. ఎలాగైనా హిందీలో సక్సెస్ కావాలని బాగా కష్టపడింది. కాకపోతే, ప్రణీత నటించిన మొదటి హిందీ సినిమా హంగామా 2 కరోనా కారణంగా వాయిదా పడుతూ చివరకు జులై 24న హాట్ స్టార్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయి, బాగానే హడావిడి చేసింది. ఎంత చేసినా ఉపయోగం ఏముంది ?

ప్రణీత మొదటి హిందీ చిత్రం ‘హంగామా 2’ ఘోరంగా ప్లాప్ అయింది. ఈ సినిమా దారుణంగా ఉందని క్రిటిక్స్ ముక్తకంఠంతో తేల్చారు. ఈ సినిమాకి రేటింగ్స్ కూడా చాల తక్కువ ఇచ్చారు. మొత్తంగా బోర్ గా సినిమా ఎలా తీయాలో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు అంటూ ఒక స్టేట్ మెంట్ కూడా పాస్ చేశారు. దీనికితోడు ప్రణీత గురించి మరీ అద్వానంగా రాశారు.

ఎర్ర తోలు ఉంటే స్టార్స్ అయిపోరు అంటూ ఆమె పై నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. పాపం ప్రణీత పెళ్లి తర్వాత విడుదలైన మొదటి సినిమా ఇది. అయినా ప్రణీతకు ప్లాప్ లు కొత్తేమి కాదులేండి. కానీ పెళ్లి తర్వాత మొదటి సినిమా కాబట్టి, కొన్ని పట్టింపులు ఉంటాయి కదా, అందుకే ప్రణీత బాగా ఫీల్ అవుతుందట. మొత్తమ్మీద, ప్రణీత బాలీవుడ్ కెరీర్ ఇక ముగిసినట్లే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper