OTT Movies: సంక్రాంతి(Sankranthi) తెలుగువారికి అతిపెద్ద పండగ. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కలిసి తమ సొంత గ్రామాల్లో వేడుకలు జరుపుకుంటారు. గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, పోటీలు ఏర్పాటు చేస్తారు. ప్రతి పల్లెలో లోగిళ్ళు శోభను సంతరించుకుంటాయి. సంక్రాంతి పండగ రోజుల్లో కుటుంబ సమేతంగా సినిమాలు చూడటం కూడా సాంప్రదాయంగా ఉంది. ఇండస్ట్రీకి సంక్రాంతి బెస్ట్ సీజన్. కొంచెం టాక్ అటూ ఇటూ ఉన్నా మినిమమ్ వసూళ్లు గ్యారంటీ. ఇక హిట్ టాక్ వస్తే వసూళ్ల వర్షమే.
ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్(Game Changer), బాలకృష్ణ(Balakrishna) డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆల్రెడీ గేమ్ ఛేంజర్ థియేటర్స్ లోకి వచ్చేసింది. ఈ మూడు చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఓటీటీలో కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ తమ ఆడియన్స్ కోసం అదిరిపోయే సినిమాలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి.
తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో హైడ్ అండ్ సీక్ టైటిల్ తో ఒక చిత్రం విడుదలవుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక రోల్స్ చేశారు. అలాగే 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్ సైతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఈ శుక్రవారం ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న చిత్రాల లిస్ట్
నెట్ఫ్లిక్స్
యాడ్ విటమ్-జనవరి 10
బ్లాక్ వారెంట్-జనవరి 10
ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10
హాట్ స్టార్
గూస్ బంప్స్: ది వానిషింగ్- జనవరి 10
జీ5
సబర్మతి రిపోర్ట్- జనవరి 10
ఆహా
హైడ్ అండ్ సీక్ – జనవరి 10
హోయ్ చోయ్
నిఖోజ్- సీజన్ 2- జనవరి 10
Web Title: 7 crazy movies in ott one day dont miss interesting details
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com