spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas Salaar Movie: అటు తండ్రి, ఇటు కూతురు.. మధ్యలో ప్రభాస్

Prabhas Salaar Movie: అటు తండ్రి, ఇటు కూతురు.. మధ్యలో ప్రభాస్

Prabhas Salaar Movie: హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రానున్న ‘సలార్’ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీ ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుంది బాలీవుడ్ క్రేజీ బ్యూటీ. ఇంతకీ ఎవరు ఆ క్రేజీ బ్యూటీ అనేగా ? ‘సారా అలీ ఖాన్’. సలార్ లో ప్రభాస్ ప్రేయసిగా సారా అలీ ఖాన్ నటించబోతుంది. అలాగే ప్రభాస్ తో కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా సారా అలీ ఖాన్ నటిస్తోందట.

Prabhas Salaar Movie
Prabhas Salaar Movie

సారా అలీ ఖాన్ ఓ ఉన్నతాధికారి కుమార్తె పాత్రలో కనిపించబోతుందని.. తన అవసరం రీత్యా ఆమెతో ఎఫైర్ పెట్టుకుని తను అనుకున్నది ప్రభాస్ సాధిస్తాడని.. పైగా సారా అలీ ఖాన్ పాత్రలో చిన్న ట్విస్ట్ కూడా ఉండబోతుంది అని తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ – సారా అలీ ఖాన్ లవ్ ట్రాక్ నాలుగు సీన్స్ లో ముగుస్తోందట. ఇక ‘సలార్‌’ కొత్త షెడ్యూల్‌ లో సారా అలీ ఖాన్ పార్ట్ తీయబోతున్నారని కూడా తెలుస్తోంది.

Also Read:  ‘ఆడవాళ్లు..’ దెబ్బకు 8 కోట్లు పోగొట్టుకున్న నిర్మాత

మొత్తానికి సారా అలీ ఖాన్ కెరీర్ ఈ సినిమాతో టర్న్ అయినట్టే. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా లైమ్‌ లైట్‌ లోకి రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తోన్న సారా అలీ ఖాన్ కి, ఇది గోల్డన్ ఛాన్స్ లాంటిదే. ఇప్పటికే సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఆయా సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే సారా అలీ ఖాన్ ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు కూడా చేస్తోంది.

ఇప్పుడు సారా అలీ ఖాన్ ఖాతాలో ‘సలార్‌’ కూడా చేరింది. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడొస్తుందా? అంటూ ఆశగా చూసిన అభిమానులకు ఈ న్యూస్ మంచి కిక్కిచ్చే వార్తే. ఏది ఏమైనా ప్రభాస్ అటు ఆదిపురుష్ లో సారా తండ్రి సైఫ్ తోనూ ఇటు కూతురితోనూ నటిస్తున్నాడు. ఇక ‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకోవాలని సలార్ నిర్మాతలు స‌లార్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

Sara Ali Khan
Sara Ali Khan

ఒకవేళ రెండు పార్ట్స్ గా తీసుకువస్తే బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు భారీ లాభాలు వస్తాయి. పైగా రాజమౌళి తర్వాత ఆ స్థాయి మార్కెట్ ఉన్న డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్. కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. మరి రెండు పార్ట్స్ గా ఈ సినిమా వస్తోందా ? రాదా ? చూడాలి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Also Read:ఆ హీరోయిన్ పై ఎన్టీఆర్ ప్రత్యేక ఇంట్రెస్ట్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Oktelugu Epaper