SS Rajamouli: రాజమౌళి.. క్రియేటివిటీకి అండ్ విజువల్ సెన్స్ కి సింబాలిజం, కమర్షియల్ సినిమాలకు రాజమౌళి పర్ఫెక్ట్ డెఫినిషన్.. రాజమౌళి డైరెక్షన్ లో ఒక భారీ తనం ఉంటుంది, రాజమౌళి పాత్రల్లో అద్భుతాలు ఉంటాయి. రాజమౌళి యాక్షన్ లో ఎమోషన్ ఉంటుంది. రాజమౌళి మాస్ ఎలిమెంట్స్ లో ఒక విజన్ ఉంటుంది. అందుకే.. ‘రాజమౌళి’ అనే పదమే ఒక బ్రాండ్ అయింది.

నేటి డిజిటల్ పోటీ ప్రపంచంలో తన కంటూ సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకోవడం, పైగా తన మార్క్ ను దశాబ్దాలుగా సక్సెస్ ఫుల్ గా నిలబెట్టుకుంటూ రావడం ఒక్క రాజమౌళికే సాధ్యం అయింది. బహుశా అందుకే రాజమౌళి ఓ ప్రత్యేకమైన బ్రాండ్ అయ్యాడు. ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోగలిగాడు. అసలు దర్శకులకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ జనరేషన్ లో రాజమౌళితోనే మొదలైంది.
Also Read: ‘ఆడవాళ్లు..’ దెబ్బకు 8 కోట్లు పోగొట్టుకున్న నిర్మాత
అయితే, రాజమౌళి కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం ‘సింహాద్రి’. ఈ సినిమా ఎన్టీఆర్ ను స్టార్ ని చేసింది. హీరోకి క్యారక్టరైజేషన్ అండ్ ప్లాష్ బ్యాక్ ఇచ్చి.. దానితో సినిమాని ఎలా నడపాలో రాజమౌళి పరిశ్రమకు నేర్పించే స్థాయికి ఎదిగాడు. సామాన్య హీరోని కూడా అద్భుతంగా చూపిస్తూ సినిమాను తీసే ఏకైక దర్శకుడు ఒక్క ‘రాజమౌళి’ మాత్రమే.
మగధీరతో ఇండస్ట్రిని ఒక ఊపు ఊపేసినా… ఈగతో భారీ విజయం అందుకున్నా.. బాహుబలితో గౌరవాన్ని సాధించినా.. బహుబలి 2తో అలరించినా..రాజమౌళి మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు. ఓ దశలో పర్సనల్ లైఫ్ లో కూడా రాజమౌళి తన స్థాయిని స్తోమతను ఎంత పెంచుకున్నా.. రాజమౌళి మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు. అందుకే.. ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఒక చరిత్ర.. రాజమౌళి అంటే ఒక ట్రెండ్ సెట్టర్.

పైగా నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తుతం భారీ రికార్డ్స్ ను క్రియేట్ చేయడానికి సిద్ధం అయ్యింది. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: ‘భీమ్లా నాయక్’ 15 డేస్ కలెక్షన్స్.. పవన్ రేంజ్ ఇది
[…] Also Raad: SS Rajamouli: రాజమౌళి అంటే ఇప్పుడొక చరిత్ర […]