Homeఎంటర్టైన్మెంట్Radhe shyam: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన "రాధే శ్యామ్" ప్రీ రిలీజ్...

Radhe shyam: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు…

Radhe shyam: దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ఆయన నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి పండుగ కానుకగా జనవరి 14న విడుదలకానుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ప్రేమకథగా ఈ మూవీ తెరకెక్కుతుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు. అయితే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్‌ ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే నేడు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది.

prabhas radhe shyam pre release event photos goes viral on social media

ఈ వేడుకకు సంబంధించిన ఒక్కో విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను టాలెంటెడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి హోస్ట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. అలానే ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి తో పాటు ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న దర్శకులంతా హాజరు కానున్నారని సమాచారం. ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను మూవీ యూనిట్ షేర్ చేసింది. నేషనల్ లెవెల్ లో జరగనున్న ఈ ఈవెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఈ సినిమాతో పాటు, ప్రభాస్​ సలార్​, ఆదిపురుష్​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ పూర్తయింది.

https://twitter.com/RadheShyamFilm/status/1473964320539103237?s=20

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Balakrishna Injury

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Oktelugu Epaper