
Radhe Shyam: సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ రిలీజ్ అవుతుందా ? గూగుల్ లో చెక్ చేస్తే రిలీజ్ డేట్ కూడా కనిపిస్తోంది. మరెందుకు ? సినిమా నుంచి సరిగ్గా అప్ డేట్స్ లేవు. పైగా ప్రమోషన్స్ కూడా బలంగా లేవు, ఎందుకు ? అని కోపంతో ఊగిపోతూ ‘రాధేశ్యామ్’ నిర్మాతలకు బుర్రలో గుజ్జు లేదు అనుకుంటా !. అయినా పాన్ ఇండియా సినిమా అని ఎనౌన్స్ చేస్తే సరిపోతుందా ? పాన్ ఇండియా ప్రమోషన్స్ కూడా చేయాలి కదా ?
మావోడికి ఏమి తెలియదు, మంచితనమే మా వాడి శాపం అంటూ ప్రభాస్ ఇంకా ఎన్నాళ్ళు బాధ పడాలి. అసలు ఒక భారీ సినిమా తీస్తున్నప్పుడు అన్నీ ముందే అనేసుకోవాలి. ఎందుకంటే అంతా అయిపోయాక ఇక అనుకోవానికి ఏమి మిగలదు గనుక. అయినా తమ సినిమా ప్రచారం ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియనప్పుడు రిలీజ్ డేట్ ను ఎందుకు ముందుగానే ప్రకటించాలి ?
ఇప్పటికే, ‘రాధేశ్యామ్’(Radhe Shyam) విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. గతంలో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఈ రేంజ్ డిప్రెషన్ ఎప్పుడు లేదు. అసలు తమ అభిమాన హీరో సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు అని సూసైడ్ లెటర్ రాసి చావడానికి కూడా సిద్ధ పడిన బాగోతం ఈ ఒక్క ‘రాధేశ్యామ్’కే జరిగింది.
ఆ అభిమాని సూసైడ్ నోట్ ఇలా సాగింది. ‘టు యూవీ క్రియేషన్స్ వారికీ.. సర్ జీవితంలో ఇప్పటివరకూ ఒక్క లెటర్ కూడా రాయని నేను, మొదటిసారి సూసైడ్ నోట్ రాస్తానని నా కలలో కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. కనీసం నా చావును చూసైనా మీరు మా రాధేశ్యామ్ అప్ డేట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు మమ్మల్ని చాలా రోజుల పాటు బాగా వెయిట్ చేయించారు,
మేం కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేసి చేసి విసిగిపోయాం. ఇక చాలు సర్. నా చావుకు కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరక్టర్ రాధాకృష్ణ’ అంటూ ఒక లెటర్ రాసి, ఆ అభిమాని చివర్లో రాసిన వ్యాఖ్య.. ‘ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోకండి. ఇట్లు.. రెబల్ స్టార్ ఫ్యాన్” అంటూ అతను తన లెటర్ ముగించాడు. ఏమిటి ? నిజంగానే ఇంతటి అభిమానులు ఉన్నారా ? సినిమా అప్ డేట్లు ఇవ్వకపోతే సూసైడ్ లు చేసుకుంటారా ? ఏమిటో ప్చ్ !
Also Read: రాధే శ్యామ్ అప్ డేట్స్ ఇవ్వలేదని యూవీ క్రియేషన్స్ కి ప్రభాస్ ఫాన్స్ రాసిన ఈ ఎమోషనల్ లెటర్ చూసారా ?