Homeఎంటర్టైన్మెంట్Couple Friendly Box Office Collection: ప్రభాస్ ఇంటర్వ్యూ ఎఫెక్ట్..భారీగా పెరిగిన 'కపుల్ ఫ్రెండ్లీ' వసూళ్లు..8వ...

Couple Friendly Box Office Collection: ప్రభాస్ ఇంటర్వ్యూ ఎఫెక్ట్..భారీగా పెరిగిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ వసూళ్లు..8వ రోజు వచ్చిన గ్రాస్ ఎంతంటే!

Couple Friendly Box Office Collection: ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన చిత్రాల్లో ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). సంతోష్ శోభన్(Santosh sobhan), మానస వారణాసి(Manasa Varanasi) హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కష్టమేనేమో అని విశ్లేషకులు కామెంట్స్ చేశారు. కానీ వీకెండ్ లో ఈ […]

Couple Friendly Box Office Collection: ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన చిత్రాల్లో ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). సంతోష్ శోభన్(Santosh sobhan), మానస వారణాసి(Manasa Varanasi) హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కష్టమేనేమో అని విశ్లేషకులు కామెంట్స్ చేశారు. కానీ వీకెండ్ లో ఈ చిత్రం కలెక్షన్స్ ఎవ్వరూ ఊహించనంత పెరిగింది. ఎంతలా అంటే ఈ వీకెండ్ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘హే బల్వంత్’ చిత్రం కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది అన్నమాట. బుక్ మై షో యాప్ లో ‘హే బల్వంత్’ చిత్రానికి రెండవ రోజు 19 వేల టిక్కెట్లు అమ్ముడుపోతే, ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి 23 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీనిని బట్టీ కలెక్షన్స్ ఏ రేంజ్ లో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు .

రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) తో ఈ మూవీ టీం చేసిన ఇంటర్వ్యూ చాలా బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఏమి సినిమా తీశారబ్బా..ఆ ట్రాన్స్ నుండి బయటకు రావడానికి నాకు చాలా సమయం పట్టింది. అందులోనూ సరిగ్గా షూటింగ్ అయిపోయిన తర్వాత చూసా ఈ సినిమాని’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. అంత పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఇలా ఈ చిన్న సినిమా గురించి అంత గొప్పగా మాట్లాడినప్పుడు కలెక్షన్స్ పైన ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. 8 వ రోజు నూన్ షోస్ నుండే ఈ చిత్రానికి మంచి గ్రోత్ కనిపించింది. ఓవరాల్ గా నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే, ఈ సినిమాకు శనివారం రోజున కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. ముందు రోజు వచ్చిన వసూళ్లతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 8 రోజులకు కలిపి 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను దాటేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 6.5 కోట్ల రూపాయలకు జరిగింది. ఈరోజు కచ్చితంగా 6 కోట్ల షేర్ మార్కుని అందుకుంటుంది, రేపటితో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి ఈ చిత్రం లాభాల్లోకి అడుగుపెట్టబోతుంది. ఇదంతా ప్రభాస్ ఇంటర్వ్యూ మహిమ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper