Pooja Hegde: పూజా హెగ్డే సోషల్ మీడియా పోస్ట్స్ కాకరేపుతున్నాయి. ఆమె సెక్సీ ఫోటోలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కుర్రాళ్లను చెడగొట్టడమే పనిగా పెట్టుకున్న పూజా హెగ్డే గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ నిద్రకు భంగం కలిగిస్తుంది. తాజాగా పూజా గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో దర్శనమిచ్చారు. ఆమె సూపర్ హాట్ గ్లామరస్ లుక్ మతులు పోగొడుతుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ గా చేయగా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ పిచ్చ కిక్ ఫీల్ అవుతున్నారు. నచ్చిన కామెంట్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. పూజా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

ఇక పూజా కెరీర్ రేసు గుర్రంలా దూసుకుపోతుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ అంటూ సవారి చేస్తుంది. బడా బడా ప్రాజెక్ట్స్ దక్కించుకొని ఇతర హీరోయిన్స్ కి సవాలు విసురుతుంది. మహేష్ కి జంటగా పూజా నటిస్తున్న SSMB 28 షూటింగ్ ఇటీవల మొదలైంది. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. మహేష్-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. త్రివిక్రమ్ తో పూజాకు కూడా ఇది హ్యాట్రిక్ కావడం మరో విశేషం. గతంలో వీరి కాంబినేషన్ అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాలు విడుదలయ్యాయి.
పూజా చేతిలో ఉన్న మరొక బిగ్ ప్రాజెక్ట్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఫర్హాద్ సామ్జీ దర్శకుడు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ 2023 రంజాన్ కానుకగా విడుదల కానుంది. వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్న సల్మాన్ ఈ మూవీతో కమ్ బ్యాక్ కావాలనుకుంటున్నారు.ఇక రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్ మూవీలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాల షూటింగ్స్ లో పూజా ఏక కాలంలో పాల్గొంటున్నారు. పూజా కాలికి చిన్న గాయమైనట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. దీంతో ఆమె నటిస్తున్న చిత్రాల షూటింగ్ కి బ్రేక్ పడుతుందేమోనన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

ఇక పూజాకు కూడా సాలిడ్ హిట్ అవసరం. ఆమె నటించిన గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య డిజాస్టర్ రిజల్ట్ అందుకున్నాయి. ప్లాప్స్ లో హ్యాట్రిక్ పూర్తి చేసిన పూజా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చేస్తున్నారు. అలాగే చిత్రీకరణ మొదలైన జనగణమన మధ్యలో ఆగిపోవడం మైనస్ గా మారింది.