Homeఎంటర్టైన్మెంట్Pokiri Mahesh Babu Ileana Incident: పోకిరి సమయంలో మహేష్ బాబు కి ఇలియానాకి మధ్య...

Pokiri Mahesh Babu Ileana Incident: పోకిరి సమయంలో మహేష్ బాబు కి ఇలియానాకి మధ్య ఏం జరిగింది…సూపర్ స్టార్ తనకి సారీ ఎందుకు చెప్పాడు..?

Pokiri Mahesh Babu Ileana Incident: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్లడానికి గల కారణం ఏంటి అంటే మన హీరోలు దర్శకులు కొత్త కథలతో ప్రేక్షకులను ఆదరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సినిమాను చూసే విధానాన్ని కూడా మార్చేస్తున్నారు. బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేశాడు… ఇక మన స్టార్ హీరోల్లో మహేష్ బాబు సైతం ప్రస్తుతం రాజమౌళితో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరియర్ లోనే మొదటి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన పోకిరి సినిమా సమయంలో ఆయన హీరోయిన్ ఇలియానా కి సారీ చెప్పాడు. ఎందుకని మహేష్ బాబు ఇలియానా కి సారి చెప్పాడు అంటూ అప్పట్లో కొన్ని వార్తలైతే మీడియాలో హల్ చల్ చేశాయి.

నిజానికి మహేష్ బాబు ఏం తప్పు చేశాడు ఎందుకని ఇలియానా కి సారీ చెప్పాడు అంటూ చాలా కథనాలైతే వచ్చాయి. మరి దానికి గల కారణం ఏంటి అంటే పోకిరి సినిమా షూటింగ్ పబ్లిక్ లో జరుగుతున్నప్పుడు మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు ను చూడటానికి తన మీదకి ఎగబడ్డారట. ఇక అతనితో పాటుగా అక్కడే ఉన్న ఇలియానా సైతం ఆ క్రౌడ్ లో ఇరుక్కుపోయిందట.

తన ఫ్యాన్స్ వల్లే ఇలియానా అలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని మహేష్ బాబు తనకు సారీ చెప్పాడట. ఇక మొత్తానికైతే మహేష్ బాబు సంస్కారాన్ని తెలుసుకుని చాలామంది అతని గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. ఇక ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మహేష్ బాబు తన ఫ్యాన్స్ తరఫున ఎలాంటి రెస్పాన్సిబిలిటి తీసుకుంటాడో మనం అర్థం చేసుకోవచ్చు.

మొత్తానికైతే పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేసి మహేష్ బాబు కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు పూర్తి కమర్షియల్ హంగులతో ఉన్నప్పటికి ఇప్పుడు వారణాసి సినిమాతో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper