Homeఎంటర్టైన్మెంట్Peddi movie shooting completed: 'పెద్ది' మూవీ షూటింగ్ పూర్తి.. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన...

Peddi movie shooting completed: ‘పెద్ది’ మూవీ షూటింగ్ పూర్తి.. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన మేకర్స్..

Peddi movie shooting completed: అభిమానులు , ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం విడుదల తేదీని మేకర్స్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ముందుగా జూన్ 25 న విడుదల చేద్దామని అనుకున్నారు , కానీ జూన్ 4 న విడుదల అవ్వాల్సిన ‘టాక్సిక్’ చిత్రం వాయిదా పడడంతో , ఈ చిత్రాన్ని జూన్ 4 న విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ విషయం సోషల్ […]

Peddi movie shooting completed: అభిమానులు , ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం విడుదల తేదీని మేకర్స్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ముందుగా జూన్ 25 న విడుదల చేద్దామని అనుకున్నారు , కానీ జూన్ 4 న విడుదల అవ్వాల్సిన ‘టాక్సిక్’ చిత్రం వాయిదా పడడంతో , ఈ చిత్రాన్ని జూన్ 4 న విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ విషయం సోషల్ మీడియా లో లీకై రెండు రోజులైంది. కానీ మేకర్స్ నేడు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. జూన్ 4 బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి సరైన సమయం. ఎందుకంటే జూన్ 11 న పిల్లలకు స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయి.

చివరి వారం రోజుల సెలవు సమయం కాబట్టి, ఈ చిత్రానికి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు , బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు చాలా సాలిడ్ గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీని మార్చారు , ఇకనైనా సరైన సమయానికి వస్తుందా అనే అనుమానం అభిమానుల్లో ఉండడం సహజమే. కానీ ఇంతకు ముందు వాయిదా పడడానికి కారణం బోలెడంత షూటింగ్ తో పాటు , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా బ్యాలన్స్ ఉండడం వల్ల. కానీ నిన్నటితో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశలో ఉంది. అందుకే ఇప్పుడు ధైర్యం గా విడుదల తేదీని లాక్ చేశారని అంటున్నారు విశ్లేషకులు. మరి అభిమానులను , ప్రేక్షకులను ఇంతకాలం ఊరిస్తూ వచ్చిన ఈ క్రేజ్ చిత్రం, వాళ్ళ అంచనాలను ఎంత మేరకు అందుకుంటుందో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాకు సరైన ప్రొమోషన్స్ చేయడం అవసరం. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్ లో భారీ గా విడుదల అవ్వబోతున్న సినిమా కాబట్టి. సరిగ్గా ప్రమోట్ చేసి ఈ చిత్రాన్ని నార్త్ ఇండియా ఆడియన్స్ కి చేరువ చేస్తే , కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పుతుందని, ఓపెనింగ్స్ లో ఆల్ టైం రికార్డు ని క్రియేట్ చేసి , ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఈ చిత్రానికి ఉందని అంటున్నారు. సినిమా విడుదల అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది కాబట్టి , కచ్చితంగా ప్రొమోషన్స్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో జరుగుతాయని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆ రేంజ్ లో ప్రొమోషన్స్ మేకర్స్ చేస్తారో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper