Homeఎంటర్టైన్మెంట్Peddi Movie: మే 29 నుండి థియేటర్స్ బంద్.. 'పెద్ది' చిత్రానికి కోలుకోలేని షాక్.. అసలు...

Peddi Movie: మే 29 నుండి థియేటర్స్ బంద్.. ‘పెద్ది’ చిత్రానికి కోలుకోలేని షాక్.. అసలు ఏమైందంటే..

Peddi Movie: తెలంగాణ లో మళ్లీ థియేటర్స్ యాజమాన్యాలు , ఎక్సిభిటర్స్ యుద్ధం మొదలు పెట్టారు. నేడు ఏర్పాటు చేసిన సమావేశం లో మాకు ఎట్టి పరిస్థితిలోనూ కమీషన్ బేసిస్ మీదనే సినిమాలను రన్ చెయ్యాలి అనే ప్రతిపాదన పెట్టారు. ఈ అంశం పై గత కొన్ని రోజుల నుండి చర్చలు నడుస్తూనే ఉన్నాయి, అవి విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ విధానం పై దిల్ రాజు వర్గం సుముఖం గానే ఉంది , ఎందుకంటే తెలంగాణ […]

Peddi Movie: తెలంగాణ లో మళ్లీ థియేటర్స్ యాజమాన్యాలు , ఎక్సిభిటర్స్ యుద్ధం మొదలు పెట్టారు. నేడు ఏర్పాటు చేసిన సమావేశం లో మాకు ఎట్టి పరిస్థితిలోనూ కమీషన్ బేసిస్ మీదనే సినిమాలను రన్ చెయ్యాలి అనే ప్రతిపాదన పెట్టారు. ఈ అంశం పై గత కొన్ని రోజుల నుండి చర్చలు నడుస్తూనే ఉన్నాయి, అవి విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ విధానం పై దిల్ రాజు వర్గం సుముఖం గానే ఉంది , ఎందుకంటే తెలంగాణ లో అత్యధిక శాతం థియేటర్స్ ఉన్నవి వీళ్ళకే కాబట్టి , కానీ అందుకు ఇతర నిర్మాతలు అసలు ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. ఈ కారణం చేత , రీసెంట్ గా ఈ సంస్థ నుండి విడుదలైన ‘జెట్ లీ’ చిత్రానికి దిల్ రాజు మరియు ఏషియన్ ప్రాపర్టీస్ లో విడుదల ని బ్యాన్ చేశారు.

ఈ నెలలో మరోసారి సమావేశం ఉంటుందట , ఆ సమావేశం సఫలం అవ్వకుంటే , ఈ నెల 29 నుండి థియేటర్స్ ని బంద్ చెయ్యాలని అనుకుంటున్నారట ఎక్సిభిటర్స్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అయితే వచ్చే నెల 4 న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమాకు నైజాం ప్రాంతం లో 60 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంత బిజినెస్ జరిగిన ఈ చిత్రాన్ని నాశనం చేసేందుకు దిల్ రాజు గ్యాంగ్ పెద్ద రూట్ మ్యాప్ వేసిందని సోషల్ మీడియా లో సాగుతున్న చర్చ. కాసేపటి క్రితమే దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడుతూ ‘ఇకపై మీరు ప్రభుత్వం నుండి జీవోలు తెచ్చుకున్నా సరే , మా సింగిల్ స్క్రీన్స్ లో మామూలు టికెట్ రేట్స్ మాత్రమే ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

అంటే ‘పెద్ది’ చిత్రానికి అత్యధిక టికెట్ రేట్స్ మా థియేటర్స్ లో అనుమతించము అని చెప్పకనే చెప్పారు. అభిమానులను భయపెడుతున్న మరో అంశం ఏమిటంటే , ఈ సినిమాని ‘జెట్ లీ’ లాగానే దిల్ రాజు , ఏషియన్ గ్రూప్స్ కి సంబంధించిన థియేటర్స్, బ్యానర్స్ లో బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఇలా జరగడం చాలా అన్యాయం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒక నిర్మాత అయ్యుండి , కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిన ఒక పెద్ద సినిమాని డ్యామేజ్ చేయాలనీ చూడడం అత్యంత నీచమైన చర్య అని, దిల్ రాజు ఇలాంటి పాలిటిక్స్ ఆపకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper