Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Overseas Advance Booking: ఓవర్సీస్ లో 'పెద్ది' అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు.. ఒక్కో...

Peddi Movie Overseas Advance Booking: ఓవర్సీస్ లో ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే..

Peddi Movie Overseas Advance Booking: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నీ అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే , ఈ చిత్రాన్ని గత నెల 26 న విడుదల చేసి ఉండేవాళ్ళు మేకర్స్. కానీ అప్పటికీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం, దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పెండింగ్ ఉండడం తో మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. ఇప్పుడు చెప్పిన తేదికి ఈ చిత్రాన్ని తీసుకొని వచ్చేందుకు మేకర్స్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి రేపు సాయంత్రమే వదులుదామని అనుకున్నారట, కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పూర్తి అవ్వకపోవడం తో 27 కి వాయిదా వేసారట.

Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

27 వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ టీజర్ విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ కూడా బాగా పేలింది. విడుదల చేసిన రెండు పాటలు పెద్ద హిట్ అయ్యాయి, అదే విధంగా గ్లింప్స్ వీడియో కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ నెల 27 నే ప్రారంభం కాబోతుంది. ఆరోజు రామ్ చరణ్ పుట్టినరోజు కావడం తో మేకర్స్ ఆరోజు నుండే మొదలు పెడితే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు. టికెట్ రేట్స్ విషయానికి వస్తే ప్రీమియర్ షోస్ కి ఐమాక్స్ ఫార్మాట్ మరియు దిబాక్స్ స్క్రీన్స్ కి 35 డాలర్లు అట. అంటే ఇండియా కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే అక్షరాలా 3281 రూపాయిలు అన్నమాట.

అదే విధంగా XD/PLF ఫార్మాట్ స్క్రీన్స్ కి 30 డాలర్ల టికెట్ రేట్ ఉంటుందట. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 2812 రూపాయిలు. ఇక స్టాండర్డ్ ఫార్మాట్ స్క్రీన్స్ కి అయితే టికెట్ రేట్ ని 25 డాలర్లకు విక్రయించబోతున్నారు. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 2343 రూపాయిలు అన్నమాట. సినిమాకు మంచి హైప్ కూడా ఉండడం తో కచ్చితంగా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ నుండే 3 మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. నార్త్ అమెరికా లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 7 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ఫుల్ రన్ లో రాబట్టాలి. మరి ఆ రేంజ్ గ్రాస్ ని రాబడుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper