Homeఎంటర్టైన్మెంట్Sujeeth Meets Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ ని కలవబోతున్న డైరెక్టర్ సుజిత్.. 'ఓజీ...

Sujeeth Meets Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ ని కలవబోతున్న డైరెక్టర్ సుజిత్.. ‘ఓజీ 2’ గురించి సెన్సేషనల్ అప్డేట్..

Sujeeth Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. వారం రోజుల క్రితం ‘ఓజీ 2’ గురించి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ఒక అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ‘ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ 2 చేయబోతున్నాడు. టైమింగ్ ఒక్కటే నిర్ణయించుకోవాల్సి ఉంది. సుజిత్ ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తాము’ అని ఒక […]

Sujeeth Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. వారం రోజుల క్రితం ‘ఓజీ 2’ గురించి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ఒక అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ‘ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ 2 చేయబోతున్నాడు. టైమింగ్ ఒక్కటే నిర్ణయించుకోవాల్సి ఉంది. సుజిత్ ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తాము’ అని ఒక ట్వీట్ వచ్చింది అంతే, సోషల్ మీడియా మొత్తం అల్లకల్లోలం అయ్యింది. ఈ ట్వీట్ కి ఏకంగా 1 కోటి 20 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు కొంతమంది స్టార్ హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాకపోవడం గమనార్హం. దీనిని బట్టీ ఈ చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే డైరెక్టర్ సుజిత్ రెండు రోజుల క్రితమే ఇండియా కి తిరిగి వచ్చేశాడు . పవన్ కళ్యాణ్ ని ఎప్పుడెప్పుడు కలుస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం లో , నేడే ఆయన పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంగళగిరి లో ఉన్నాడు. సుజిత్ కూడా మంగళగిరి కి బయలుదేరినట్టు సమాచారం. నేడు సాయంత్రం లోపు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుండి ‘ఓజీ 2’ గురించి మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సుజిత్ పవన్ కళ్యాణ్ ని కలిసిన ఫోటో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తే , మరోసారి ఇంటర్నెట్ మొత్తం షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్ లో సంచలన టాపిక్ గా మరోసారి నేడు నిలవబోతుంది ఈ చిత్రం.

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్. నవంబర్ నెల నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాసేపు పక్కన పెడితే , ‘ఓజీ 2’ నిర్మాణం లో దివీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భాగం అవ్వడం లేదట. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో పాటు , టాలీవుడ్ లో పేరు మోసిన మరో బడా ప్రొడక్షన్ హౌస్ నిర్మాణం లో భాగం అవ్వబోతుందట. ‘ఓజీ’ లాగా కాకుండా , ఈ చిత్రాన్ని ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో , అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ సుజిత్. సినిమా షూటింగ్ అత్యధిక శాతం జపాన్ లోనే జరిగే అవకాశం ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper