spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: మేనల్లుడితో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్.. నిజమేనా ?

Pawan Kalyan: మేనల్లుడితో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్.. నిజమేనా ?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా పవన్ మరోసారి మల్టీస్టారర్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే వెంకటేశ్తో ‘గోపాల గోపాల’, రానాతో ‘భీమ్లా నాయక్’ చేశారు. ఇప్పుడు తన ఫ్యామిలీలో హీరో, మేనల్లుడు సాయిధరమ్తో కలిసి తెర పంచుకునేందుకు సిద్ధమయ్యారు. తమిళంలో గతేడాది ఓటీటీలో విడుదలైన ‘వినోదయ సితమ్’ సినిమా ఇప్పుడు తెలుగులోనూ ఆయనే డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan
Pawan Kalyan

అయితే అధికారిక ప్రకటన మాత్రం త్వరలో రానుంది.మరి తన మేనల్లుడితో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ చేస్తే.. నిజంగానే అదిరిపోతోంది. ఏది ఏమైనా పవన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమాను త్వరత్వరగా పూర్తి చేశాడు. పైగా పవన్ ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామి కూడాను. అదే విధంగా హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సురేంధర్ రెడ్డి చిత్రం ఇలా పవన్ ఫుల్ బిజీగా ఉన్నాడు.

Also Read: బాలయ్య సంచలనం.. రాజీనామా సవాల్.. వైసీపీ రెడీనా?

అయితే వచ్చే ఎన్నికల కోసం కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నాడు. ఇక ఎన్నికల సమయం చాలా వేగంగా వస్తోంది. మరి ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేయాలి అనే ఒత్తిడి పవన్ కి ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అదే ఫీల్ అవుతున్నట్లు సమాచారం. 2024 ఎన్నికలకు సమయం సమీపిస్తోంది అని, ఇక కొత్త సినిమాలు వద్దు అని పవన్ నిర్ణయించుకున్నట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

Pawan Kalyan
Pawan Kalyan

మరి పవన్ ఎందుకు మళ్ళీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు అంటూ ఆయన రాజకీయ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలంటే ఇప్పటి నుంచి ఎన్నికల ప్రణాళికపై పని చేయాల్సి ఉంది. పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది.

Also Read:  తెలంగాణ బడ్జెట్లో ‘హైలెట్’ అంశం అదేనట?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Oktelugu Epaper