Homeఎంటర్టైన్మెంట్Vijay Jana Nayagan expectations: అప్పట్లో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన మ్యాజిక్..'జన నాయగన్' విషయంలో...

Vijay Jana Nayagan expectations: అప్పట్లో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన మ్యాజిక్..’జన నాయగన్’ విషయంలో విజయ్ రిపీట్ చేస్తాడా..

Vijay Jana Nayagan expectations: 2013 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం సృష్టించిన సునామీ ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాకు ఎదురైనటువంటి కష్టాలు ఇండస్ట్రీ లో అప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఎదురు అవ్వలేదు. ఒకపక్క సమైక్య ఆంధ్ర ఉద్యమం తారా స్థాయిలో జరుగుతుంది. ఆ కారణం చేత విడుదల తేదీని కూడా వాయిదా […]

Vijay Jana Nayagan expectations: 2013 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం సృష్టించిన సునామీ ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాకు ఎదురైనటువంటి కష్టాలు ఇండస్ట్రీ లో అప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఎదురు అవ్వలేదు. ఒకపక్క సమైక్య ఆంధ్ర ఉద్యమం తారా స్థాయిలో జరుగుతుంది. ఆ కారణం చేత విడుదల తేదీని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అలాంటి సమయం లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ మొత్తం HD క్వాలిటీ ప్రింట్ తో సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. విడుదల లోపు పూర్తి సినిమా కూడా అందుబాటులోకి వచ్చేసింది. అయ్యో దేవుడా , ఇక పాపం నిర్మాత పరిస్థితి ఏంటో అని అంతా బాధ పడ్డారు. కానీ దేవుడు ఆశీస్సులు , అభిమానుల ప్రేమ కారణంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన మ్యాజిక్ ని చూసి అప్పట్లో ట్రేడ్ విశ్లేషకులు నివ్వెరపోయారు.

మొదటి రోజు ఓపెనింగ్ నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమా సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామీ మామూలుది కాదు. అప్పటి వరకు మగధీర చిత్రానికి దరిదాపుల్లో ఒక్క స్టార్ హీరో కూడా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా ఆ సినిమా రికార్డుని అవలీల గా దాటేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. మొదటి రోజు నమోదు అయ్యే వసూళ్లు , రెండవ రోజు, మూడవ రోజు వచ్చేవి. అలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది ఆ చిత్రం. అయితే ఇప్పుడు విజయ్ కూడా అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నాడా ?, సవాళ్ళను ఎదురుకొని భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడా అని ఇప్పుడు తమిళనాడు జోరుగా సాగుతున్న చర్చ.

ఎందుకంటే నిన్న ఈ చిత్రం మొత్తం HD క్వాలిటీ ప్రింట్ తో సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. విజయ్ ని ఇష్టపడని వాళ్ళు , ఈ సినిమాలోని సన్నివేశాలను సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో తిప్పుతూ వైరల్ చేస్తున్నారు. అనేక సన్నివేశాలు విపరీతంగా ట్రోల్ కి గురి అవుతున్నాయి. వీటి అన్నిటికీ తోడు ఈ చిత్రం ‘భగవంత్ కేసరి’ కి జిరాక్స్ కాపీ అనే విషయం కూడా అందరికీ అర్థం అయిపోయింది. ఇన్ని సవాళ్ళను ఎదురుకొని ఈ సినిమా సక్సెస్ అందుకుంటుందా?, ఒకవేళ అందుకుంటే మాత్రం విజయ్ క్రేజ్ కి , ఆయన స్టార్ స్టేటస్ కి ట్రేడ్ చేతులెత్తి మొక్కినా తప్పు లేదు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తలరాత ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper