Homeఎంటర్టైన్మెంట్Pavithra Lokesh- Naresh: ఆయనతో సహజీవనం చేస్తున్నా.. నరేష్ తో పెళ్లిపై బాంబు పేల్చిన పవిత్రలోకేష్

Pavithra Lokesh- Naresh: ఆయనతో సహజీవనం చేస్తున్నా.. నరేష్ తో పెళ్లిపై బాంబు పేల్చిన పవిత్రలోకేష్

Pavithra Lokesh- Naresh: తెలుగు సినిమాల ప్రస్తుత మదర్ క్యారెక్టర్లకు ‘పవిత్రా లోకేషే’ మెయిన్ కేరాఫ్ అడ్రెస్. మొదట్లో పవిత్రా లోకేష్ ఐటమ్ సాంగ్స్ లో కూడా దుమ్ము దులిపింది. ఆ తర్వాత అవకాశాలు రాక, సైడ్ ట్రాక్స్ ను నమ్ముకుని, సైడ్ క్యారెక్టర్స్ తో ఫేమస్ అయ్యింది. అయితే, గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్ తో ఈ నటి వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే.

తాజాగా కన్నడ మీడియాకు చెందిన పవర్ టీవీ మీడియా స్టింగ్ ఆపరేషన్‌ లో పవిత్రా లోకేష్.. నరేష్ తో తన లేటు ఘాటు ప్రేమ గుట్టు గురించి మనసు విప్పి అసలు ముచ్చట చెప్పుకొచ్చింది.

Also Read: Jr NTR Phone Number Leak: జూ.ఎన్టీఆర్ ఫోన్ నంబర్ లీక్.. కాల్స్ మోత మోగిపోతోంది

Pavithra Lokesh- Naresh
Pavithra Lokesh

మరి ఆ ముచ్చట ఏమిటో ఈమె మాటల్లోనే.. ‘నరేష్ గారితో నా ప్రేమ వ్యవహారం పై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఐతే, నరేష్ ఇంట్లో వాళ్లు నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా రిసీవ్ చేసుకున్నారు. మా ఇద్దరి సహజీవనం నిజమే. మా రిలేషన్షిప్‌ కు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా అంగీకారం తెలిపారు.

Pavithra Lokesh- Naresh
Pavithra Lokesh

అలాగే నరేష్ గారి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమోదం తెలిపారు. మేము త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఫామ్‌ హౌస్‌ లో కృష్ణ, నరేష్, మేము కలిసే ఉంటున్నాం’ అని పవిత్రా లోకేష్ స్పష్టం చేసింది.

Pavithra Lokesh- Naresh
Pavithra Lokesh

నరేష్ గురించి కూడా ఆమె మాట్లాడుతూ.. ‘నరేష్ గారు ఒక మోసగాడు అని ‘నరేష్ గారి మూడో భార్య రమ్య రఘుపతి’ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ, నరేష్ గారు అసలు అబద్దాలు కూడా చెప్పరు. నరేష్ ఎవర్నీ మోసం చేసినట్టు నాకు కనిపించలేదు. మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు, ఆయన కుటుంబం మాతో ఉన్నారు. నా జీవితంలో ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా లైఫ్ లో నాకు ఎలాంటి డిమాండ్లు లేవు. నరేష్ జీవితంలో నాకు చోటు ఉంటే చాలు’ అని పవిత్ర లోకేష్ ఎమోషనల్ గా చెప్పింది.

Pavithra Lokesh- Naresh
Pavithra Lokesh

మొత్తానికి ‘పవిత్రా లోకేష్’.. తల్లి పాత్రలకు ప్రధాన ఆప్షన్ గా మారిపోయింది. అయితే, పవిత్ర లోకేష్ జనరల్ గా పవిత్రమైన పాత్రల్లోనే కనిపిస్తుంటుంది. తెలుగు సినిమాల్లో ఆమె ఎక్కువగా హీరోకో, హీరోయిన్ కో తల్లిగా దర్శనమిస్తూ మంచి ఇమేజ్ ను సంపాధించింది.

Pavithra Lokesh- Naresh
Pavithra Lokesh

కాగా అలాంటి పవిత్ర లోకేష్.. నరేష్ తో లేటు వయసులో ప్రేమలో పడి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. అసలు రియల్ లైఫ్ లో పవిత్ర ఆంటీ చాలా “బోల్డ్”గానే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువైపోయాయి.

Also Read:Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ వల్ల వింత వ్యాది తో బాధపడుతున్న ఒక్క అమ్మాయి..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular