Homeఎంటర్టైన్మెంట్Venkatesh Chanti Movie: వెంకటేష్ చంటి సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Venkatesh Chanti Movie: వెంకటేష్ చంటి సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Venkatesh Chanti Movie: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్లాసిక్ మూవీస్ జాబితాలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘ చంటి’ అనే చిత్రం..తమిళం లో ప్రభు మరియు కుష్బూ హీరో హీరోయిన్లు గా తెరకెక్కి సంచల విజయం సాధించిన ‘చిన్న తంబీ’ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..అప్పట్లోనే ఈ సినిమా 40 కి పైగా కేంద్రాలలో సత్తా దినోత్సవం జరుపుకోవడం విశేషం..అయితే ఈ సినిమా తెరకెక్కబోయ్యే ముందు చాలా హైడ్రామా నే నడిచింది..అప్పట్లో పరుచూరి బ్రదర్స్ కి రచయితలుగా ఎలాంటి క్రేజ్ ఉండేదో మన అందరికి తెలిసిందే..పరుచూరి బ్రదర్స్ మరియు బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలకి అయితే హీరో తో సంబంధం లేకుండా విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది..అలా అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా చేద్దాం అని అనుకున్నారు..ఎలాంటి సినిమా చెయ్యాలా అని తలబాదుకుంటున్న సమయం లో బి.గోపాల్ గారు అప్పట్లో తమిళం లో సెన్సషనల్ హిట్ అయినా ‘చిన్న తంబీ’ అనే సినిమా చూసి ఎంతగానో ఆకర్షితులైయ్యాడు.

Venkatesh Chanti Movie
Venkatesh

Also Read: NTR Flop Movie Super Hit In Bangladesh: బాంగ్లాదేశ్ లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయిన ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా ఏమిటో తెలుసా?

సినిమా చాలా బాగుంది మీరు కూడా వెంటనే చూడండి అని బి.గోపాల్ పరుచూరి బ్రదర్స్ కి చెప్పాడు..వాళ్ళు కూడా సినిమాని చూసి ఎంతో ఆకర్షితులై వెంటనే ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి బాలయ్య బాబు ని పెట్టి రీమేక్ చేద్దాం అని అనుకున్నారు..కానీ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసే సమయానికి తెలిసిన విషయం ఏమిటి అంటే అప్పటికే ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు గారు కొనుగోలు చేసి రవిరాజా పినిశెట్టి గారి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ ని పెట్టి తియ్యబోతున్నారని తెలిసింది..దీనితో బాలయ్య చేద్దాం అనుకున్న ఈ ప్రాజెక్ట్ చివరికి విక్టరీ వెంకటేష్ చేతికి వెళ్ళింది..కానీ ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఈ సినిమాలో వెంకటేష్ కనబర్చిన నటన చూసిన తర్వాత టాలీవుడ్ లో ఈ పాత్రకి ఆయన తప్ప మరెవ్వరు న్యాయం చెయ్యలేరు అనే రేంజ్ లో నటించి ప్రేక్షకులను మైమరచిపొయ్యేలా చేసాడు..తెలుగు లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాని కన్నడ లో ‘రామాచారి’ అనే పేరు తో రీమేక్ చేసారు..అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది..ఇక ఆ తర్వాత హిందీ లో ‘అనారీ’ అనే పేరు తో రీమేక్ చేసారు..ఇక్కడ కూడా వెంకటేష్ హీరో గా నటించగా , హిందీ లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.

Venkatesh Chanti Movie
Bala Krishna

Also Read: Anchor Rashmi Secret Marriage: రహస్యం గా జరిగిపోయిన యాంకర్ రష్మీ పెళ్లి
Recommended Videos

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular