TS SSC Results 2022: ఎట్టకేలకు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. కరోనా కారణంగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేస్తూ వచ్చిన పాఠశాల విద్యాశాఖ ప్రస్తుతం ఫలితాల వెల్లడిలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా చేసిన విద్యాశాఖ పదో తరగతి ఫలితాలను కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రకటించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో పది పరీక్షల విషయంలో విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతోంది.

ఈ సంవత్సరం పదో తరగతి కోసం దాదాపు ఐదు లక్షల పైనే విద్యార్థులు హాజరయ్యారు. పదకొండు పేపర్లను ఆరుకు కుదించారు. కరోనా ప్రభావంతో సిలబస్ కూడా ముప్పై శాతం తగ్గించారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాల్లో పాస్ పర్సంటేజీ 67 శాతం మాత్రమే నమోదు కావడంతో ఈ సారి తక్కువ మంది విద్యార్థులే ఉత్తీర్ణులైనట్లు తెలుస్తోంది. దీంతో పదో తరగతి ఫలితాలపై ప్రతిపక్షాలు సైతం పెదవి విరుస్తున్నాయి. ప్రభుత్వ నిర్వాకంతోనే ఫలితాల్లో తేడా జరిగినట్లు సమాచారం.
Also Read: Chandrababu Naidu: చంద్రబాబు పార్టీ నడవడానికి కోట్లు ఇస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరో తెలుసా?
పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు.
bse.tealngang. gov.in, bseresults.telangang.gov.in వెబ్ సైట్ల ద్వారా పదో తరగతి ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు గమనించి వెబ్ సైట్లలో తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మార్కులు చూసుకోవాలని సూచిస్తోంది. పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా బోర్డుకు ఫిర్యాదు చేసుకోవాలని తెలిపింది.

కరోనా ప్రభావంతో సిలబస్ తగ్గించినా ఫలితాల్లో పర్సంటేజీ తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై అధికారులు ఏం సమాధానం చెబుతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకు ఇంత దారుణమైన పర్సంటేజీ రావడానికి కారణాలేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది ఫలితాలపై అనుమానాలు వస్తున్నాయి. విద్యార్థులను ఫెయిల్ చేయడంలో ఔచిత్యమేమిటనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో టెన్త్ రిజల్ట్స్ పై ప్రభుత్వం ఏం చెబుతోందని పలువురు అడుగుతున్నారు.
Also Read:BJP Big Strategy: బీజేపీ భారీ వ్యూహం.. రాష్ట్రాల కమ్యూనిటీలతో సమావేశం