Homeఎంటర్టైన్మెంట్Paradise movie new release date: ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి రెడీ...

Paradise movie new release date: ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారా..?

Paradise movie new release date: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ఇంకా లేటయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. కారణం ఏదైనా కూడా ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనే విషయం పక్కన […]

Paradise movie new release date: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ఇంకా లేటయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. కారణం ఏదైనా కూడా ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనే విషయం పక్కన పెడితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చిరస్మరణీయంగా నిలిచిపోయే సినిమా అవుతుంది అంటూ మరి కొంతమంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల మేకింగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దసర సినిమాతో తన స్టామినా ఏంటో చూపించిన శ్రీకాంత్ ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. నాని సైతం మాస్ హీరోగా మారడానికి ఈ సినిమాని ఆసరాగా చేసుకుంటున్నాడు. నిజానికి టైర్ వన్ హీరోగా మారే కెపాసిటి నాని కి ఉందా లేదా అనే డైలమా గత కొద్దిరోజుల నుంచి అందరిలో నడుస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే నాని అమాంతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోతాడు. టైర్ వన్ హీరోగా కూడా చోటు సంపాదించుకునే అవకాశం ఉంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిగా వెయిట్ చేయాల్సిందే…

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా తొందర్లోనే అనౌన్స్ చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది…

ఈ సినిమా ఎలాగూ పోస్ట్ పోన్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే రవితేజ ‘ఇరుముడి’ సినిమాని ఆగస్టు 21వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అలాగే సంపంత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న ‘భోగి’ సినిమాని సైతం ఆగస్టు 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper