Homeఎంటర్టైన్మెంట్ఓటీటీManjummel Boys OTT: యూత్ ని ఊపేసిన సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి... ఎక్కడ చూడొచ్చంటే?

Manjummel Boys OTT: యూత్ ని ఊపేసిన సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి… ఎక్కడ చూడొచ్చంటే?

మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమలు తెలుగులో సైతం మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్ర హీరోయిన్ మమిత బైజు అబ్బాయిల కలలరాణిగా మారిపోయింది.

Manjummel Boys OTT: మలయాళ చిత్ర పరిశ్రమ దేశాన్ని ఆకర్షిస్తుంది. వారి చిన్న చిన్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఎలాంటి స్టార్స్ లేకుండా తెరకెక్కిస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాయి. ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేమలు యూత్ కి తెగ నచ్చేసింది. థియేటర్స్ కుర్రకారుతో నిండిపోయాయి.

మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమలు తెలుగులో సైతం మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్ర హీరోయిన్ మమిత బైజు అబ్బాయిల కలలరాణిగా మారిపోయింది. భారీ విజయం సాధించిన మరొక మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. మలయాళంలో ఈ చిత్రం విపరీతమైన ఆదరణ పొందింది. 20 కోట్లకు తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

మంజుమ్మెల్ బాయ్స్ సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఒక గృహలో చిక్కుకున్న వ్యక్తిని తన మిత్రులు ఎలా కాపాడారు అనేదే కథ. ఫిబ్రవరి 22న విడుదలైన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రానికి చిదంబరం దర్శకుడు. తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్ర చేయగా… శ్రీనాథ్ బసి, బాలు వర్గీసే కీలక పాత్రల్లో నటించారు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రానికి సుషిన్ శ్యామ్ మ్యూజిక్ అందించారు.

ఈ మలయాళ బ్లాక్ బస్టర్ ఓటీటీ విడుదలకు సిద్ధం అయ్యింది. మంజుమ్మెల్ బాయ్స్ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. మే 3 నుండి మంజుమ్మెల్ బాయ్స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. మలయాళంలో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఓటీటీ లవర్స్ కి పండగని చెప్పాలి..

Related News

Most Popular

Oktelugu Epaper