Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఒకే వారం లో మూడు ఎలిమినేషన్స్ జరగడం చూడలేదు. అలాంటిది ఈ సీజన్ మొదలైన మొదటి వారం లోనే ఏకంగా ముగ్గురిని ఎలిమినేట్ చేశారు. అది కూడా ఆడియన్స్ ఓటింగ్ తో కాదు, హౌస్ లో కంటెస్టెంట్స్ ఓటింగ్ ని ఆధారంగా తీసుకొని చరణ్, చైత్ర లను ఎలిమినేట్ చేశారు. రేపు ఆడియన్స్ ఓటింగ్ లో చివర్లో ఉన్న కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఎందుకో ‘బిగ్ బాస్’ టీం కావాలని కృష్ణుడు ని సేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ వారం అందరికంటే తక్కువ ఓటింగ్ ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే , అది కృష్ణుడు నే. కానీ అతన్ని ఎలిమినేట్ చేయలేదట. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే, సుధీర్ రెడ్డి ని ఎలిమినేట్ చేశారట.
యూట్యూబ్ లో అదాన్ టాక్స్ ద్వారా ఎంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి , మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సుధీర్ రెడ్డి పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉండేవి. కానీ ఆయన హౌస్ లోకి వచ్చిన తర్వాత తన మార్కు ని చూపించలేకపోయారు. మొదటి టాస్క్ ని కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. అయితే ప్రతీ కంటెస్టెంట్ కూడా, బిగ్ బాస్ హౌస్ వాతావరణం కి అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. సుధీర్ కి మంచి పొటెన్షియల్ ఉంది , కచ్చితంగా ఈయన పొటెన్షియల్ కూడా రాబోయే రోజుల్లో బయటపడేది. కానీ ఇంతలోపే దురదృష్టం కొద్దీ ఇతను ఎలిమినేట్ అయ్యాడు. అయితే కచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే ఇతన్ని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఓటింగ్ చివరి రెండు స్థానాల్లో ఉన్నది కృష్ణుడు , సుధీరే. కానీ కృష్ణుడు వల్ల ఎంతో కొంత కంటెంట్ వస్తుంది.
అంతే కాకుండా ఈ షో లో టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్న రోహిత్ తో కృష్ణుడు గొడవలు కూడా పెట్టుకున్నాడు. రాబోయే రోజుల్లో వీళ్ళ మధ్య క్లాష్ ఎవ్వరూ ఊహించని రీతిలో ఉండే అవకాశాలు ఉన్నాయనే కారణంతోనే సుధీర్ ని ఎలిమినేట్ చేసి కృష్ణుడు ని ఉంచారు. దీన్ని బట్టీ బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ ఎంత ఇస్తే, అంత సేఫ్ అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేడు త్రిగున్ పై బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎవరికీ లేనంత నెగిటివిటీ ఉంది. అయినప్పటికీ అతను ఓటింగ్ లో టాప్ 5 రేంజ్ లో ఉండడానికి కారణం , బోలెడంత కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టే. సుధీర్ అలాంటి కంటెంట్ ఇవ్వలేకపోయాడు. శ్రేష్టి తో లవ్ ట్రాక్ కూడా ట్రై చేసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈయనతో మనకు ఉపయోగం లేదు అని బిగ్ బాస్ టీం అనుకోవడం వల్లే నేడు బయటకు వచ్చేశాడు.