Anchor Charmila: ఈమధ్య కాలంలో హీరోయిన్స్ తో సమానంగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యాంకర్ చర్మిలా. ఇప్పుడు ఏ చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా మేకర్స్ ఈమె నే సంప్రదిస్తున్నారు. యాంకర్ సుమ తర్వాత ప్రస్తుతం అంతటి బిజీ యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది చర్మిలా నే. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆ స్థాయి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈమెకు సంబంధించి ఏ చిన్న వీడియో వచ్చినా , అది తెగ వైరల్ అయిపోతుంది. జెన్ జీ యూత్ ఆమెకు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో డైరెక్టర్లు , హీరోలు చర్మిలా తో ప్రత్యేకంగా చిట్ చాట్ చేస్తూ ఉంటారు. ఆమె ఇచ్చే క్యూట్ సమాదానాలు బాగా వైరల్ అవుతుంటాయి, కాబట్టి తమ సినిమాకు కూడా బోలెడంత పబ్లిసిటీ దొరుకుతుంది అనే ప్లాన్ తోనే ఈమెని తమ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ఏరికోరి ఎంచుకుంటూ ఉంటారు మేకర్స్.
రీసెంట్ గా ఈమె ‘డెలులు’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కి యాంకర్ గా చేసింది. ఈ ఈవెంట్ లో హీరో ఆమెని పిలుస్తూ ‘టీజర్ చూసారా.. ఎలా అనిపించింది?’ అని అడగ్గా , అందుకు చర్మిలా ‘చాలా బాగుంది.. ఇచ్చి పారేశారు’ అని అంటుంది. మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి అని హీరో అడగ్గా ‘చివర్లో హీరోయిన్ ‘ఆల్ మెన్ ఆర్ డాగ్స్’ అని అంటుంది కదా , అందుకు హీరో కుక్కకి పుట్టినావా నువ్వు అని అంటాడు. ఆ డైలాగ్ తెగ నచ్చేసింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది ఆ వీడియో ని సగానికి కట్ చేసి చర్మిలా హీరో ని తిట్టినట్టుగా చూపిస్తున్నారు.
ఇకపోతే చర్మిలా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. బిగ్ బాస్ టీం ఆమెని సంప్రదించారట. కానీ ఎందుకో ఆమె రాలేదు. నాల్గవ వారం లో ఎలాగో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉంటుంది. కనీసం అప్పుడైనా చర్మిలా వస్తుందో లేదో చూడాలి. ఈమె వస్తే మాత్రం సీజన్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది , అంతే కాకుండా ఈమెకు క్రేజ్ విపరీతంగా పెరిగి సినిమాల్లో కూడా హీరోయిన్ అవకాశాలు వస్తాయి, చూడాలి మరి ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది.
View this post on Instagram