Bigg Boss 10 Telugu: ఆడియన్స్ ఓట్లు వేయకండి.. మీ ఓట్లకు విలువ లేదు , ఓటింగ్ ని ఆధారంగా చేసుకొని మేము ఎలిమినేషన్ చెయ్యము అనే విధంగా ప్రవర్తిస్తున్నారు ‘బిగ్ బాస్ 10’ టీం. నిన్న చరణ్ ఎలిమినేషన్ ఎంత అన్యాయంగా అనిపించిందో మీరంతా చూసే ఉంటారు. ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా , మెజారిటీ సెలబ్రిటీలు ఉన్న చోట , వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని , ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఒక సామాన్యుడి కెరీర్ ని కేవలం మూడు రోజుల్లోనే ముగించేశారు. మొదటి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టడం అత్యంత దారుణమైన నిర్ణయం అనుకుంటే , ఇదే మొదటి వారం లో మరో ఎలిమినేషన్ ని కూడా ప్లాన్ చేయడం మరో దారుణం. అవును , మీరు వింటున్నదే నిజమే. నేడు సాయంత్రం బిగ్ బాస్ హౌస్ లో మరో ఎలిమినేషన్ ప్లాన్ చేశారట మేకర్స్.
దీన్ని నేటి ఎపిసోడ్ లో మనం చూడొచ్చు. ఈ ఎలిమినేషన్ తో పాటు , ఆదివారం రోజున ఆడియన్స్ ఓటింగ్ ఆధారిత ఎలిమినేషన్ కూడా ఉంటుందట. అంటే ఈ ఒక్క వారం లో మూడు ఎలిమినేషన్స్ అన్నమాట. బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ జరగని ప్రక్రియ ఇది. బిగ్ బాస్ టీం ప్రేక్షకులకు ఊహించని సప్రైజ్ ఇచ్చాం, ఎలా ఉంది, ఇచ్చి పారేశాం కదా అని అనుకోవచ్చు, కానీ వాళ్ళ హిస్టరీ లో తీసుకున్న అతి చెత్త నిర్ణయం ఇది. ఆడియన్స్ ఓటింగ్ కి మేము విలువ ఇవ్వడం లేదు , అనవసరం మీ ఓట్లు వృధా చేసుకోకండి అని పరోక్షంగా చెప్తున్నారు. ఈ ఇండికేషన్స్ షో పై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అయితే నేడు జరిగే ఎలిమినేషన్ లో ఒక ట్విస్ట్ కూడా ఉండొచ్చు.
సీక్రెట్ రూమ్ ని రెడీ చేశారట మేకర్స్. ఈ సీక్రెట్ రూమ్ లో నేడు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ని పెట్టొచ్చు. కానీ ఇందులో నూటికి నూరు శాతం గ్యారంటీ లేదు. అయితే ప్రస్తుతానికి హై రిస్క్ జోన్ లో కేవలం చైత్ర మాత్రమే ఉంది. రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్ లు టాస్కులు ఆడి గెలిచి శాశ్వత హౌస్ మేట్స్ అయ్యారు. కాబట్టి వీరిలో ఎలిమినేషన్ ఉండదు. చైత్ర లేదా , వేరే ఏ కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘అగ్ని పరీక్ష 2’ నుండి వచ్చిన సామాన్యులను టార్గెట్ చేసినట్టుగా నిన్నటి చరణ్ ఎలిమినేషన్ తో అందరికీ ఒక అభిప్రాయం ఏర్పడింది. మరి ఈసారి కూడా వారిలోనే ఎలిమినేషన్ ఉంటుందా అనేది చూడాలి.