NTR : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపైతే లభిస్తోంది… ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే పేర్లలో శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఆయన హీరోగా రాణిస్తూ సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ వచ్చాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లాంటి నటుడు పాన్ ఇండియా మార్కెట్ కోసం విపరీతంగా ప్రయత్నం అయితే చేస్తున్నాడు. గత సంవత్సరం దేవర (Devara)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో ఆశించిన మేరకు విజయన్నైతే సాధించలేకపోయాడు. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తే 500 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది. దాంతో ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించలేకపోయింది. ఇక తన తోటి హీరోలందరు వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతుంటే ఎన్టీఆర్ మాత్రం ఇంకా 500 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) చేయబోతున్న సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడతానని భారీ కాన్ఫిడెంట్ తో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఏంటి ఇచ్చి ఆ ఫ్యామిలీ బాధ్యతలను ప్రస్తుతం తనే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు.Prashanth Neel
Also Read : రామ్ చరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే!
అయితే బాలకృష్ణకి అలాగే వాళ్ళ బ్రదర్స్ కి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా కొనసాగడం ఇష్టం లేదట… అందుకే సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అసలు అయిన వారసుడు తను కాదని తన ప్లేసులో మరొక హీరోని నందమూరి ఫ్యామిలీ హీరోగా నిలపాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
అందుకోసమే ఇప్పుడు జానకిరామ్ కొడుకు అయిన యంగ్ ఎన్టీఆర్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో తనకు చెక్ పెట్టాలని తన వాళ్ళే చూడడం చాలా బాధాకరమైన విషయమే అయినప్పటికి తనను తాను స్టార్ హీరోగా మలుచుకున్న విధానం చాలా అద్భుతం…
కాబట్టి ఇకమీదట నుంచి కూడా తను మంచి సినిమాలను ఎంచుకొని ముందుకు సాగితే పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి… మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి భారీ క్రేజ్ ను సంపాదించుకోవడం మిగతా హీరోలకు సాధ్యం కాదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు ఏ పాత్ర అయినా సరే అలవోకగా చేసి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు కాబట్టే ఆయనకు అంత మంచి గుర్తింపైతే లభించింది.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్ లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి..? దాని ధర ఎంతో తెలుసా!