‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సూర్యుడు చంద్రుడు, గురుడు, ప్రభావంతో మాలవ్య యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు భూ వివాదాల్లో ఇరుక్కుంటారు. అయితే ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశతో ఉంటారు. కొన్ని విషయాల్లో సంయమనం పాటించాలి. చట్టపరమైన చిక్కులు వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబంల విభేదాలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసులో ప్రతికూల ఆలోచనలు వచ్చిన వాటిని భాలో కాకుండా ఉండాలి. వ్యాపారులను కొందరు మోసం చేసే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. విదేశాల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టపడాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు చాలా రంగాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తగా పనులు ప్రారంభించే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్లతో సంయమనం పాటించాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. ఆర్థికల లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమాచారాలు అందుకున్న తర్వాత తలనొప్పి తయారవుతుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే కుటుంబ సభ్యుల తో కలిసి వెళ్లకుండా ఉండాలి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు వాహనాలపై వెళ్లాల్సిన వస్తే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థులు చదువులో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగులు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సీనియర్లతో పరిష్కరించుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులు గతంలో పోటీ పరీక్షలో పాల్గొంటే ఇప్పుడు సరైన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం వాహనతంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. పిల్లల కెరీర్ గురించి శుభవార్తలు వింటారు. పనిమీద బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో విభేదాలు ఉండే అవకాశం ఉంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేని ఏర్పడుతుంది. పై చదువుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చాలాకాలం తర్వాత పాత స్నేహితులను కలవడంతో ఉన్న సంఘ ఉంటారు. వింత భాగస్వామి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త ఆస్తి కొనుగోలు పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి తెలియని ఈరోజు బాగుంటుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. స్నేహితులకు దూరంగా ఉండటమే మంచిది. ఆర్థిక విషయాల్లో ఇతరులతో వాగ్వాదాలు ఉండకూడదు. కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోవాలి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు రావచ్చు. సలహాలు ఇచ్చేముందు పెద్దలను సంప్రదించడం మంచిది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈ రోజు అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులు కొత్త ప్రణాళికలను ఏర్పరచుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఏదైనా మార్పులు చేయాలని అనుకుంటే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టు కోడలు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు పెండింగ్ పనులు పూర్తవుతాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉపాధ్యాయుల సలహా తీసుకొని కెరియర్లో మంచి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. తల్లిదండ్రులతో వాదనలకు దిగకుండా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు విలాసమంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో కొత్త పెట్టుబడును పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు.