Junior NTR: ఉగాది కానుకగా విడుదలై థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ రన్ ని సొంతం చేసుకుంటున్న ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ని రీసెంట్ గానే హైదరాబాద్ లోని శిల్ప కళావేదిక లో గ్రాండ్ గా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై అభిమానులను ఉద్దేశిస్తూ, మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగించిన ప్రసంగం సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వీకెండ్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ కలెక్షన్స్ బూస్ట్ అవ్వడానికి ఎన్టీఆర్ ప్రసంగం బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్(Junior NTR) ధరించిన దుస్తులు, స్టేజి మీదకు రాకముందు క్రింద కూర్చొని తాగిన డ్రింక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: ఎన్టీఆర్ సన్నబడటానికి అసలు కారణం ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్
గ్రీన్ బాటిల్ లో ఉన్న డ్రింక్ ని ఎన్టీఆర్ తాగడం మనమంతా ఈవెంట్ లో చూసే ఉంటాము. ఈ డ్రింక్ ఏంటి వెరైటీ గా ఉంది?, ఎక్కడ దొరుకుతుంది ఇది?, ధర ఎంత అని అభిమానులు సోషల్ మీడియా మొత్తం వెతకడం మొదలు పెట్టారు. అయితే అభిమానులకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, గ్రీన్ బాటిల్ లో ఉన్న ఆ డ్రింక్ కేవలం నీళ్లు మాత్రమే. ఈ నీళ్లు సోడా టేస్ట్ లో ఉంటుంది. దీనిని పెరియల్ కంపెనీ కి చెందిన కార్బోనేటేడ్ మినరల్ వాటర్ అని అంటారు. సుమారుగా 300 ML లీటర్ల బాటిలో ఇది అందుబాటులో ఉంటుంది. దీని ధర 145 నుండి మొదలు అవుతుంది. ఆరోగ్యానికి ఈ డ్రింక్ ఎంతో మంచిది కూడా. దాదాపుగా సినీ సెలెబ్రిటీలందరూ షూటింగ్ సమయాల్లో ఈ డ్రింక్ నే తీసుకుంటారు.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే హృతిక్ రోషన్ తో కలిసి ఆయన ‘వార్ 2’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకొని ఎన్టీఆర్ లేకుండా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రెండవ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తోనే షూటింగ్ ని జరుపుకోనుంది. ఈ సినిమా తర్వాత ఆయన ‘దేవర’ సీక్వెల్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయాన్నీ ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్ లో తెలిపాడు. గత ఏడాది విడుదలైన ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.