NTR competition from other language heroes: తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. అందుకే గత సంవత్సరం హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2 ‘ అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ కి పెద్దగా మార్కెట్ క్రియేట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు.
ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ టాప్ లెవల్ కి వెళ్తాడు. ఇప్పటికే ఇతర భాషల హీరోల నుంచి తనకు విపరీతమైన పోటీ ఎదురవుతుంది… గత సంవత్సరం ‘కాంతారా చాప్టర్ వన్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన తను సైతం 800 కోట్ల మార్క్ ను అందుకున్నాడు.
అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘అనిమల్’ సినిమాతో ఒక రేంజ్ ని క్రియేట్ చేసుకున్న రన్బీర్ కపూర్ సైతం 900 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాడు… ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో సోలో హీరోగా ఇంత భారీ సక్సెస్ ని ఇంతకు ముందెన్నడూ సాధించలేదు. కలెక్షన్ల విషయంలో కూడా ఆయన ఈ రేంజ్ ఫిగర్ అయితే రాబట్టలేదు.
కాబట్టి ఇతర భాషల హీరోల నుంచి కూడా భారీ పోటీ వస్తుంది. మన హీరోలు ఎలాగో టైర్ వన్ హీరోలుగా మారిపోయి ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి మనవాళ్ళ నుంచి వచ్చే పోటీ ఒకెత్తయితే ఇతర భాషల నుంచి వచ్చే పోటీని తట్టుకొని ఎలా నిలబడతాడు. టైర్ వన్ హీరోల్లో తను కూడా ఒకడిగా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకోవాల్సిన అవసరమైతే ఉంది… మొత్తానికైతే డ్రాగన్ సినిమాతో ఇండస్ట్రీలో భారీ హిట్ నమోదు చేస్తాడా? లేదా అనేది చూడాలి…