Varun Tej And Nithin: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు వాళ్లకు సెట్ అయ్యే సినిమాలను మాత్రమే చేస్తుంటారు. డిఫరెంట్ జానర్స్ ను టచ్ చేయకుండా సేఫ్ జోన్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఇక మరి కొంతమంది మాత్రం ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ ఫ్లాప్ లను ముట్టగట్టుకుంటూ ఉంటారు. ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన అల్టిమేట్ గా సక్సెస్ లు సాధించిన వాళ్లకు మాత్రమే ఇక్కడ మంచి క్రేజ్ ఉంటుంది. కాబట్టి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడానికి స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆరాట పడుతుంటారు. ఇక ఈ క్రమంలోనే ఒక ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ వాళ్ళ స్ట్రాంగ్ జోన్ ఏంటో తెలుసుకొని ఆ జానర్లోనే సినిమాలను చేసి ఒక నాలుగు సక్సెస్ లను సాధించిన తర్వాత ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
ఆ ఇద్దరు హీరోల్లో వరుణ్ తేజ్ మొదటి స్థానంలో ఉన్నాడు. మెగా ప్రిన్స్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వరుణ్ తేజ్ లవ్ స్టోరీలకు బాగా సెట్ అవుతాడు. అలాగే యాక్షన్ ఎంటర్టైనర్లను కూడా అతను చాలా బాగా చేయగలరు. కానీ వాటిని వదిలేసి అంతరిక్షం, గాండీవ దారి అర్జునా అంటూ డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు.
కానీ ఆ సినిమాలేవీ ఆశించిన మేరకు విజయాలను సాధించకపోవడంతో ఆయన నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్టు డిజాస్టర్లుగా మారుతున్నాయి. ఇక ఇప్పటికైనా తేరుకొని లవ్ స్టోరీలను చేస్తే బాగుంటుంది. గతంలో ఆయన చేసిన ఫిదా, తొలిప్రేమ లాంటి లవ్ స్టోరీలు మంచి విజయాలుగా నిలిచాయి…
కానీ అతను వాటిని వదిలేసి మాస్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్లే అతనికి వరుసగా ప్లాప్లైతే వస్తున్నాయి. అలా కాకుండా ఇష్క్, గుండెజారీ గల్లంతయిందే, హార్ట్ ఎటాక్ లాంటి లవ్ స్టోరీలను ఎంచుకొని ఆయన ముందుకు సాగితే ఇప్పటికి ఆయనకు మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. లేకపోతే మాత్రం ఆయన మరికొద్ది రోజుల్లో షెడ్డు కు పరిమితమయ్యే అవకాశాలైతే ఉన్నాయి…