Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు… వాళ్ల సినిమాలకి ప్రేక్షకుల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఒకటికి రెండుసార్లు ఆ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మొత్తానికైతే వాళ్ళ సినిమాలను సూపర్ సక్సెస్ చేయడంలో ప్రేక్షకులు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ఒకవేళ సినిమా బాలేకపోయిన కూడా అభిమానులు ఒకటికి పది సార్లు ఆ సినిమాని చూసి కలెక్షన్స్ ని పెంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకరకంగా అభిమానులకు తమ హీరో అంటే పిచ్చి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలను చేసినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరోలందరు స్టార్ హీరోలే కావడం విశేషం… ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
ఇక మీడియం రేంజ్ హీరోల్లో రామ్, నితిన్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే రామ్, నితిన్, విజయ్ దేవరకొండలు మిస్ చేసుకున్న సినిమాలతో నాని సూపర్ సక్సెస్ లను సాధించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు…
ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాల వల్లే నాని స్టార్ హీరోగా మారాడు… రామ్ చేయాల్సిన ‘జెంటిల్ మెన్’ సినిమాని నాని చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక నితిన్ చేయాల్సిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ అనే సినిమాని నాని చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ దేవరకొండ చేయాల్సిన దసర సినిమాని నాని చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఈ మూడు సినిమాలు కూడా నాని కెరియర్ ను మలుపు తిప్పిన సినిమాలనే చెప్పాలి. ఈ మూడు సినిమాతోనే ఇప్పుడు ఆయన ఈ పొజిషన్లో ఉన్నాడు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ పొజిషన్లో నిలబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాలతో స్టార్ హీరోగా ఎలివేత్బవాలని చూస్తున్నాడు. అలాగే టైర్ వన్ హీరోగా మారాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…