spot_img
Homeఎంటర్టైన్మెంట్New Zealand Vs UAE T20 World Cup: టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్...

New Zealand Vs UAE T20 World Cup: టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ప్రపంచ రికార్డు..

New Zealand Vs UAE T20 World Cup: టి20 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదయింది. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో సాధ్యం కానీ ఘనతను అందుకుంది. తద్వారా ఈ స్థాయి అందుకున్న తొలి జట్టుగా న్యూజిలాండ్ రికార్డ్ సృష్టించింది.

చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో ముందుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్లేయర్లు ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యూఏఈ జట్టులో మొహమ్మద్ వసీం(66), ఆలీషన్(55), మయాంక్ రావు(21) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లు ఏకంగా 14 అదనపు పరుగులు ఇవ్వడం విశేషం. ఇందులో వైడ్ల రూపంలో ఏడు పరుగులు రావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ రెండు వికెట్లు పడగొట్టాడు. డఫీ, ఫెర్గు సన్, శాంట్ నర్, ఫిలిప్స్ తలా ఒక వికెట్ సాధించార.

అనంతరం చేజింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఒక్క వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది. 15.2 ఓవర్లలోనే 175 పరుగులు చేసి సంచలనం సృష్టించింది. టీం సెయి ఫెర్ట్(89*), ఫిన్ అలెన్(84*) పరుగులు చేశారు. వీరిద్దరిని అడ్డుకోవడం యూఏఈ బౌలర్ల వల్ల కాలేదు. పవర్ ప్లే లో న్యూజిలాండ్ జట్టు ఏకంగా 78 పరుగులు చేసింది అంటే బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 92 బంతుల్లోనే 175 పరుగులు చేసిన న్యూజిలాండ్ జట్టు.. ప్రపంచ టి20 సంచలనం సృష్టించింది.

ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా పురుషుల టి20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డ్ సృష్టించింది.

175*: సీ ఫర్ట్, అలెన్(న్యూజిలాండ్) వర్సెస్ యూఏఈ, చెన్నై 2026..

170*: బట్లర్, హేల్(ఇంగ్లాండ్) వర్సెస్ ఇండియా, అడిలైడ్, 2022

168: క్వింటన్ డికాక్, రిలీ రోసౌ(సౌత్ ఆఫ్రికా), వర్సెస్ బంగ్లాదేశ్, సిడ్ని, 2022.

166: జయవర్ధనే, కుమార సంగక్కర(శ్రీలంక) వర్సెస్ వెస్టిండీస్, బార్బోడోస్, 2010.

154: ఇబ్రహీం జద్రాన్, గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), ఉగాండా ప్రావిడెన్స్, 2024.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Oktelugu Epaper