Guess Singer: ఈ ఫొటోలో అమ్మాయిని చూశారా.. చూడగానే ఎవరో బాక్సర్.. లేక బాడీ బిల్డర్‌లా కనిపిస్తుంది కదూ.. కానీ బాగా గమనించండి.. కాస్త లోతుగా వెళ్లండి.. అయినా గుర్తురాలేదా.. రాదు కూడా ఆమె ఫేమసే.. కానీ హీరోయిన్ కాదు.. మరి ఎవరా అనుకుంటున్నారా.. ఎవరంటే.. అటు నువ్వే.. ఇటు నువ్వే.. ఎటు చూస్తున్నా అటు నువ్వే.. ఈ పాట గుర్తుందా.. కరెంటు సినిమాలోది.. కానీ హీరోయిన్ కాదు అన్నాం కదా.. ఇంకో ఇండికేషన్ ఇస్తాం చూడండి.. జూనియర్ ఎన్టీఆర్ నటిచిన ఊసర వెల్లిలో నిహారికా నిహారికా.. నువ్వే నాదారికా..నాదారికా.. ఈ పాట కూడా గుర్తుంది కదూ.. ఇంకా చెప్పాలంటే.. మహేశ్‌బాబు నటించిన నేనొక్కడినేలో హం తుజే మో కర్తా.. అనే పాట కూడా ఉంది.. ఇప్పటికి కొంత మందికి గుర్తొచ్చే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జనతా గ్యారేజ్‌లో స్వింగ్ జరా.. స్వింగ్ జరా… పాట కూడా గుర్తుండే ఉంటుంది. దీంతో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది… యస్ ఈ పాటలు పాడిన సింగర్ ఈమే.. నేహా బాసిన్.. తెలుగులో అనేక సూపర్ హిట్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అనేక భాషల్లో..
నేహా బాసిన్ తెలుగులోనే కాదు హిందీ, తమిళం, పంజాబీలో కూడా సూపర్‌హిట్ పాటలు పాడింది.అయితే ఈ అమ్ముడు హీరోయిన్లకు ఏమాత్రం తరగని బాడీ షేప్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇటీవల జిమ్‌కు వెళ్లినప్పుడు కెమెరాకు చిక్కిరంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హస్కీ వాయిస్..
హస్కీ వాయిస్‌తో రొమాంటిక్ పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించే నేహా బాసిన్ అందంలోనూ హీరోయిన్స్‌కు ఏమాత్రం తక్కువ కాదన్న విషయం ఈ వీడియోతో అర్థమవుతోంది. చాలా మంది సింగర్లు గ్లామర్ మెయింటేన్ చేస్తూ రియాలిటీ షోలు, బిగ్‌బాస్ షోలు, ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రాంలలో పాల్గొంటున్నారు. అలాగే నేహా బాసిన్ కూడా కుర్రకారు మతిపోగొట్టేలా తన అందాలతో ఆకట్టుకుంటోంది.