Nayanthara Divorce Vignesh Shivan: సౌత్ సూపర్ స్టార్ నటి నయనతార రీసెంట్ గా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ బ్యూటీ చాలా కాలం పాటు చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ తో డేటింగ్ చేసి, ఆ తర్వాత అతన్ని వివాహం చేసుకుంది. అంతేకాదు వీరిద్దరు సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఇక సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి, పిల్లలకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంది నయన. అయితే రీసెంట్ గా నటి చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఇంతకీ అందులో ఏముంది అనుకుంటున్నారా?
తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. భర్తలు చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాలా? అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ మీ వల్ల చాలా ఫేస్ చేశాను. అంటై పేర్కొంది నయనతార. అయితే ఈ పోస్ట్ ను ఆమె కొద్దిసేపటికే డిలీట్ చేసింది. కానీ కొందరు స్క్రీన్ షాట్ లు తీయడం వల్ల ఇది వైరల్ గా మారింది.
Also Read: ఇండస్ట్రీని వదిలి లాయర్ గా మారిన స్టార్ హీరోయిన్ కథ..
ఈ పోస్ట్ వైరల్ అవడంతో ఇంతకీ నయనతార, తన భర్తతో బాగానే ఉంటుందా? లేదంటే వారి మధ్య గొడవలు మొదలు అయ్యాయా అంటూ ఆరాతీస్తున్నారు నెటిజన్లు. ఇది ఒక పుకారా? లేదా ఇందులో ఏదైనా నిజం ఉందా అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే వీరు విడిపోతున్నట్టుగా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. కానీ ఈ పోస్ట్ నయనతార చేయడంతో తెగ టెన్షన్ పడుతున్నారు అభిమానులు.
నయనతార, విఘ్నేష్ 2015లో ‘నానుమ్ రోడి దాన్’ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారి 2022లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సరోగసి ద్వారా కవలలు ఉయిర్, ఉలగం 2022లో జన్మినిచ్చారు. ఇద్దరూ తరచుగా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. అలాంటిది సడెన్ గా ఇలా నయనతార పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా కొనసాగుతుంది.
Also Read: వార్ 2 మూవీ ప్రమోషన్స్ ఎన్టీఆర్ ఎలివేషన్ మామూలుగా లేదుగా…వైరల్ వీడియో…
అయితే గతంలో వేణు స్వామి మరో స్టార్ సెలబ్రెటీ కపుల్స్ విడాకులు తీసుకుంటారు. విడిపోతారు అంటూ కామెంట్లు చేశారు. సమంత, నాగచైతన్యల విషయంలో వేణు స్వామి చెప్పింది నిజం అవడంతో ఇప్పుడు మరో స్టార్ కపుల్ ఎవరూ అంటూ తెగ టెన్షన్ పడుతున్నారు నయన్ అభిమానులు. వేణు స్వామి జోస్యాలు కొన్ని నిజం అవడంతో ఇప్పుడు నయన్ దంపతులు కూడా విడాకులు తీసుకుంటారా? అంటూ తెగ బాధ పడుతున్నారు ఈ జంటను ఇష్టపడే అభిమానులు.