War 2 Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే…జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వరుసగా ఏడు విజయాలను సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని గొప్ప గుర్తింపును సంపాదించుకోవడంలో ఎన్టీఆర్ (NTR) ముందు స్థానంలో ఉన్నాడు…ఇక ప్రస్తుతం ఆయన హృతిక్ రోషన్ (Hruthik Roshan) తో కలిసి వార్ 2 (War 2) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించే స్థాయికి ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: జురాసిక్ వరల్డ్ రీబర్త్’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా? ఫట్టా?
ఈ క్రమంలోనే ఈ సినిమాలో యశ్ రాజ్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ నిర్మిస్తున్నాడు… ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎక్స్ లో ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. అది ఏంటి అంటే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఇప్పటికే ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’ (Aravinda Sametha Veeraraghava) అనే సినిమా చేశాడు. దాంతో పాటుగా దేవర (Devara) సినిమాని కూడా సితార వాళ్ళు తీసుకున్నారు. ఈ రెండింటితో పాటు ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయబోతున్నాము అని వాళ్లు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియో చాలా ఎక్సైటింగ్ గా ఉండడంతో పాటుగా ఎన్టీఆర్ యొక్క స్పందిన ఏ రేంజ్ లో ఉందో చూపించడానికి చాలావరకు దోహదపడుతుందనే చెప్పాలి.
ఇక తన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో దేవర సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టిన ఇప్పుడు వస్తున్న వార్ 2 సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…
ఇక ఇది చూసిన కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడని వరుసగా తన ఖాతాలో మరొక విజయాన్ని సాధించి ఎనిమిదోవ విజయాన్ని దక్కించుకున్న ఏకైక హీరోగా నిలుస్తాడని చాలామంది అతని అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
మొత్తానికైతే ఇండియాలో ఉన్న పాన్ ఇండియా హీరోలందరిలో ఎన్టీఆర్ టాప్ 3 పొజిషన్ లో ఉండటం విశేషం…చూడాలి మరి ఇక మీదట రాబోతున్న సినిమాలతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది…
Official:
Sithara Ents. to release #War2 in Telugu states.
— Gulte (@GulteOfficial) July 5, 2025